Eknath Shinde Account Hacked: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేకు చెందిన సోషల్ మీడియా ‘X’ ఖాతా ఆదివారం హ్యాక్ అయింది. హ్యాకర్లు అందులో పాకిస్థాన్, టర్కీ జండాల ఫొటోలను పోస్ట్ చేయడంతో సంచలనంగా మారింది. దీనిని గుర్తించిన ఏక్‌నాథ్ షిండే సోషల్ మీడియా పర్యవేక్షణ అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ పోస్ట్‌లు చూసిన నెటిజన్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కాసేపటికే ఈ వార్త వైరల్ అయింది.
ఆసియా కప్‌లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య ఆదివారం రెండో మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే ‘X’ ఖాతాను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. అనంతరం ఇస్లామిక్ దేశాలైన పాకిస్థాన్, టర్కీ జండాల ఫొటోలను హ్యాకర్లు అందులో పోస్ట్ చేశారు.
Also Read: https://teluguprabha.net/national-news/today-modi-speech-on-historic-gst-at-5pm/
ఈ క్రమంలో ఏక్‌నాథ్ షిండే ‘ఎక్స్’ ఖాతాను పర్యవేక్షించే అధికారి దీనిని గమనించారు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించారు. అనధికారికంగా పోస్ట్ చేసిన అన్ని పోస్ట్‌లను తొలగించిన టెక్నికల్ బృందం.. సుమారు 45 నిమిషాల తర్వాత హ్యాక్ అయిన ఏక్‌నాథ్ షిండే ‘ఎక్స్’ ఖాతాను పునరుద్ధరించారు. ఇప్పుడు ఆ ఖాతా మళ్లీ సాధారణ స్థితిలో కొనసాగుతోంది. ఈ ఘటనపై దృష్టి సారించి, మరిన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు టెక్నికల్ బృందం తెలిపింది.
ఈ ఘటన దేశంలో సైబర్ నేరాలు ఎంత వేగంగా పెరుగుతున్నాయో ఆ పరిస్థితులకు అద్దం పడుతోంది. డిజిటల్ లావాదేవీల పెరుగుదల, ఇంటర్నెట్ వినియోగం పెరగడం, ఏఐ వాడకం, సైబర్ దాడులకు ప్రధాన కారణాలుగా స్పష్టమవుతోంది. ఈ దాడుల వల్ల ప్రతి ఏటా ప్రజలు భారీగా నష్టపోతున్నారు. హ్యాకర్ల దాడులతో సమాజంలో భయాందోళనలను పెరిగిపోతున్నాయి.


