ఈశాన్య రాష్ట్రాల్లో జరుగనున్న శాసన సభ ఎన్నికల నిర్వహణకై తగు పోలీస్ బలగాలను పంపించే అంశంపై కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా నేడు తెలంగాణా తోపాటు పలు రాష్ట్రాల డీజీపీ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ డీజీపీ కార్యాలయం నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డీజీపీ అంజనీ కుమార్ పాల్గొన్నారు. సున్నిత ప్రాంతాలుగా ఉన్న ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లో ఈ సంవత్సరం (2023 ) లో శాసన సభ ఎన్నికలు జరగనున్నందున, ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు సాఫీగా నిర్వహించేందుకుగాను అదనపు పోలీస్ బలగాలు అవసరమున్నాయని హోం శాఖ కార్యదర్శి ఏ.కే.భల్లా కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ ఎస్.కె. జైన్, బెటాలియన్స్ ఏ.డి.జి. అభిలాష బిష్త్ పాల్గొన్నారు.
Elections: ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలకు రాష్ట్రం నుంచి పోలీస్ బలగాలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES