Encounter| ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. నారాయణ్‌పుర్ జిల్లాలోని అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు(Maoists) మృతి చెందారు.
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్, దంతెవాడ, జగదల్‌పూర్, కొండగావ్ జిల్లాల భద్రతా బలగాలు బస్తర్ పరిధిలోని అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌లో భాగంగా కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో కూంబింగ్ చేస్తున్న భద్రతా బలగాలపైకి మావోయిస్టులు కాల్పులకు దిగారు. దీంతో భద్రతా దళాలు కూడా ఎదురుకాల్పులు జరిపాయి. ఇప్పటివరకు 12 మంది మావోయిన్టులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం మిగిలిన మావోయిస్టుల కోసం ముమ్మర గాలింపు జరుగుతోందన్నారు.
కాగా ఇటీవల తెలంగాణలోని ములుగు జిల్లా అటవీ ప్రాంతంలోనూ ఎన్‌కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు.