Saturday, November 15, 2025
Homeనేషనల్MP: కుటుంబాన్ని అంతం చేసిన అక్రమ సంబంధం

MP: కుటుంబాన్ని అంతం చేసిన అక్రమ సంబంధం

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా ఇటీవల ఒక విషాద సంఘటనకు వేదిక అయింది. వివాహేతర సంబంధం కారణంగా ఓ కుటుంబం మొత్తం ప్రాణాలు విడిచింది. ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఒక మహిళ అనైతిక సంబంధానికి కట్టుబడి ఉండడంతో ఆమె భర్తతో పాటు ముగ్గురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

- Advertisement -

ఈ సంఘటన సాగర్ జిల్లా పరిధిలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. మనోహర్ లోధీ(45), ద్రౌపది భార్యాభర్తలు. వీరికి ఒక కుమార్తె(18), ఒక కుమారుడు(16) ఉన్నారు. అయితే, ద్రౌపది తన భర్త మనోహర్ స్నేహితుడు అయిన సురేంద్రతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నట్టు వెల్లడైంది.

Readmore: https://teluguprabha.net/national-news/heavy-flood-in-prayagraj-in-uttarpradesh/

ఒకరోజు కుమార్తె శివాని, తన తల్లిని సురేంద్రతో అసభ్యకరమైన స్థితిలో చూసి ఈ విషయం తండ్రికి తెలిపింది. అప్పటి నుంచే కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులు ఈ అక్రమ సంబంధాన్ని వదులుకోవాలని ద్రౌపదికి చెప్పారు. ఆమె మాత్రం సురేంద్ర లేకుండా జీవించలేను అని తెగేసి చెప్పింది. తనపై ఇలానే ఒత్తిడి చేస్తే, వారిపై వరకట్న వేధింపుల కేసు పెడతానని బెదిరించింది.

ద్రౌపది భర్త మనోహర్, స్నేహితుడు సురేంద్రను సంప్రదించి సంబంధం ముగించమని కోరాడు. కానీ సురేంద్ర తన సంబంధాన్ని వదులుకోనని చెప్పాడు. దీంతో ఇంట్లో ఉద్రిక్తతలు మరింత పెరిగిపోయాయి. కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. చివరికి ఈ పరిస్థితులను తట్టుకోలేక మనోహర్, అతని తల్లి ఫూల్రాణి (70), కుమార్తె శివాని, కుమారుడు నలుగురు కలిసి ఆత్మహత్య చేసుకున్నారు.

Readmore: https://teluguprabha.net/national-news/pahalgam-attacker-funeral-in-pok-exposes-pakistan/

స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నలుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల ఇంటి వద్ద ఒక సూసైడ్ నోట్ కూడా లభించినట్టు సమాచారం. ద్రౌపది, సురేంద్ర మధ్య ఉన్న అనైతిక సంబంధం వల్లే వారు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు కారణమైన ద్రౌపదిని, ఆమె ప్రియుడు సురేంద్రపై కేసు నమోదు చేసారు. అనంతరం అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad