Ennore Thermal Power Plant Accident: తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలోని థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎన్నూర్ థర్మల్ పవర్‌ప్లాంట్‌లో మంగళవారం సాయంత్రం నిర్మాణంలో ఉన్న శ్లాబ్ ఒక్కసారిగా కూలిపోవడంతో.. దానిపై ఉన్న కార్మికులు కిందపడ్డారు. వీరిలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
Also Read: https://teluguprabha.net/national-news/chennai-foreign-consulates-bomb-threats-email-hoaxes-2025/
ఎన్నోర్ థర్మల్ పవర్ ప్లాంట్‌లో ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన రెస్క్యూ సిబ్బంది.. క్షతగాత్రులను చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. కాగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


