EPF pensions: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పింఛనుదారులకు నగదు నిలిచిపోయింది. చిన్న మొత్తంలో ప్రతినెలా 27న బ్యాంకు ఖాతాల ద్వారా పింఛను అందుకునే వారికి జులై నెలాఖరైనా నగదు జమ కాలేదు. ఈపీఎఫ్‌వోలో కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ నేపథ్యంలో ఈ సాంకేతిక సమస్య తలెత్తినట్లు అధికారులు తెలిపారు. దీనివల్ల తెలుగు రాష్ట్రాల్లోని పింఛనుదారులకు తీవ్ర నిరాశ ఎదురైంది. తాజా సమాచారం ప్రకారం తెలంగాణలో 4.63 లక్షలు, ఏపీలో 3.29 లక్షల మంది చొప్పున మొత్తం రెండు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 7.92 లక్షల మంది పింఛనుదారులకు ఈ నెల పింఛన్లు నిలిచిపోయాయి.
డేటాబేస్ మార్పుల వల్లే జాప్యం: ఇటీవల ఈపీఎఫ్‌వో సాఫ్ట్‌వేర్‌లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. దేశవ్యాప్తంగా ‘సెంట్రలైజ్డ్ డేటాబేస్’ ద్వారా పింఛన్లు మంజూరు చేసే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల చెల్లింపుల ప్రక్రియకు సంబంధించిన స్లాట్ శుక్రవారం నాడు లభించింది. ఈ క్రమంలో శనివారం లేదా సోమవారం నాటికి పింఛనుదారులు ఖాతాల్లోకి నగదు జమయ్యే అవకాశాలున్నట్లు ఈపీఎఫ్‌వో వర్గాలు అధికారికంగా వెల్లడించారు. కేవలం జులై నెల పింఛన్లకు మాత్రమే ఈ సాంకేతిక జాప్యం జరిగిందని.. వచ్చే నెల నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా యథావిధిగా పూర్వవిధానంలోనే చెల్లింపులు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.
Also Read-Cylinder prices: తగ్గిన సిలిండర్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

