Homeనేషనల్EPFO ATM withdrawals: ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. ఏటీఎం నుంచి ఈపీఎఫ్‌ అమౌంట్‌ విత్‌డ్రాకు ఛాన్స్‌..!

EPFO ATM withdrawals: ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. ఏటీఎం నుంచి ఈపీఎఫ్‌ అమౌంట్‌ విత్‌డ్రాకు ఛాన్స్‌..!

EPFO ATM withdrawals: ఉద్యోగులకు ఈపీఎఫ్‌ఓ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇకపై బ్యాంకు ఖాతా మాదిరిగా ఈపీఎఫ్‌ఓను ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఈఎఫ్‌ఓవో చందాదారులు ఏటీఎం ద్వారా కూడా తమ పీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని త్వరలో అందుబాటులోకి తేనుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈపీఎఫ్‌ఓ ఈ కొత్త సదుపాయాన్ని ప్రవేశపెట్టనుంది. సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ట్రస్టీల సమావేశంలో దీనికి సంబంధించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ‘మనీ కంట్రోల్‌’ నివేదిక పేర్కొంది. ఈ సమావేశం అక్టోబర్‌ రెండో వారంలో జరగనుందని నివేదికలో స్పష్టం చేసింది. కాగా, ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా సదుపాయాన్ని ఈ ఏడాది జూన్‌ నుంచే అందుబాటులోకి తీసుకురానున్నట్లు కార్మికశాఖ తొలుత ప్రకటించింది. ఇందుకోసం ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను కూడా సిద్ధం చేసింది. అయితే, విత్‌డ్రాలకు సంబంధించి విధించాల్సిన పరిమితి గురించి బోర్డు ఆఫ్‌ ట్రస్టీల సమావేశంలో చర్చించాల్సిన అవసరం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అమౌంట్‌ విత్‌డ్రాపై పరిమితి విధించకపోతే ‘భవిష్యనిధి’ అసలు లక్ష్యం నీరుగారిపోతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బోర్డు సభ్యులతో చర్చించి ఈపీఎఫ్‌ఓ తుది నిర్ణయం తీసుకోనుంది.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/news/og-movie-tickets-benefit-shows/

విత్‌డ్రా కోసం ప్రత్యేకంగా ఏటీఎం కార్డు..

ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓకు 7.8 కోట్లమంది చందాదారులు ఉన్నారు. వీరికి చెందిన సుమారు రూ.28 లక్షల కోట్ల కార్పస్‌ ఫండ్‌ ఈపీఎఫ్‌ఓ వద్ద ఉంది. అయితే, అత్యవసర సమయాల్లో ఉద్యోగుల నగదు అవసరాలను తీర్చడానికి పీఎఫ్‌ మొత్తాలను ఉపసంహరించుకునే సదుపాయం తేవాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు అవసరమైన ఐటీ సేవలను సిద్ధం చేయడంతో పాటు ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు బ్యాంకులు, ఆర్‌బీఐతో కూడా కార్మికశాఖ చర్చలు జరిపింది. త్వరలోనే ఏటీఎం తరహాలో ప్రత్యేక కార్డును సభ్యులకు ఈపీఎఫ్‌ఓ జారీ చేయనుంది. అచ్చం ఏటీఎం కార్డులా ఈ కార్డు పనిచేస్తుంది. ట్రస్టీల బోర్డు సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకున్న తర్వాత విత్‌డ్రాలకు సంబంధించి మరింత స్పష్టత రానుంది. కాగా, పీఎఫ్ ఖాతాదారులకు ఏటీఎం మాదిరిగా ఒక ప్రత్యేక కార్డును ఈపీఎఫ్ఓ జారీ చేయనున్నట్లు సమాచారం. ఏటీఎం డెబిడ్ కార్డు మాదిరిగా ఈ కార్డు పని చేస్తుంది. నేరుగా ఏటీఎం కేంద్రానికి వెళ్లి పీఎఫ్ అకౌంట్లోని డబ్బులను ఉపసంహరించుకోవచ్చు. దీంతో ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదు. అత్యవసర ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ఈ సేవలు ఎంతగానో ఉపకరిస్తాయని కేంద్రం చెబుతోంది. అయితే ట్రస్టీల బోర్డు సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నాకే నగదు విత్ డ్రాలకు సంబంధించి పూర్తి స్పష్టత రానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News