Farmers Protest: తమ డిమాండ్ల సాధన కోసం రైతులు తలపెట్టిన ‘ఢిల్లీ ఛలో మార్చ్”(Delhi March) కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీసింది. రైతులను ఢిల్లీలోకి రాకుండా పంజాబ్-హరియాణా సరిహద్దు ప్రాంతం శంభు(Shambhu Border) పోలీసులు అడ్డుకున్నారు. రైతులను చెదరగొట్టేందుకు బాష్పవాయువు, జల ఫిరంగులను ప్రయోగించారు.
కనీస మద్దతు ధర సహా 11 డిమాండ్ల సాధన కోసం రైతులతు ఈ మార్చ్‌లో పాల్గొన్నారు. ఇప్పటికే రెండు సార్లు రైతుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. తాజాగా మూడోసారి కూడా వారి ప్రయత్నాన్ని భగ్నం చేశారు. కాగా రైతుల మార్చ్‌ను దృష్టిలోపెట్టుకొని హరియాణా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. శనివారం ఉదయం ఆరు గంటల నుంచి 17వ తేదీ అర్ధరాత్రి వరకు సేవలను నిలిపివేస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. పోలీసులు తమను అడ్డుకోవడంపై రైతు సంఘాల నేతలు, కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.