Nirmala Sitharama: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అస్వస్థతకు గురైనట్టుగా వార్తలొచ్చాయి. ఆర్థిక శాఖ మంత్రిగా, డైనమిక్ లేడీగా పేరు తెచ్చుకున్న 63 సంవత్సరాల నిర్మలా సీతారామన్ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో జాయిన్ అయినట్టుగా నేషనల్ మీడియాలో కథనాలొచ్చాయి. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆమె ఆసుపత్రిలో చేరినట్లుగా పలు వార్తా సంస్థలు రాసుకొచ్చాయి.
ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అస్వస్థతకు గురయ్యారన్న కథనాలతో బీజేపీ వర్గాలలో అలజడి నెలకొంది. ఇందులో నిజమెంత?, అసలు వాస్తవమేమిటి? అన్నది అర్ధం కాక బీజేపీ వర్గాలలో గందరగోళం నెలకొంది. దీనిపై ఎయిమ్స్ ఆసుపత్రి వర్గాలు కూడా స్పందించాల్సి వచ్చింది. కేంద్ర మంత్రి కేవలం సాధారణ వైద్య పరీక్షల కోసమే ఆసుపత్రికి వచ్చారని తెలిపారు. ప్రతి ఏటా ఆమె రెండు సార్లు మెడికల్ చెకప్స్ చేయించుకుంటారని, అందులో భాగంగానే ఆమె ఆసుపత్రికి వచ్చారని పేర్కొన్నారు.
ప్రస్తుతం కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ పరిస్థితి నిలకడగా ఉందని, మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎయిమ్స్ లో చేరగా.. ఆమెను ఓ ప్రైవేట్ వార్డులో అడ్మిట్ చేసినట్లు తెలుస్తుంది.