Friday, November 22, 2024
Homeనేషనల్Twitter : ఆ తప్పుని సరిద్దుకోవాల్సిన అవసరం ఉంది : ఎలాన్ మస్క్

Twitter : ఆ తప్పుని సరిద్దుకోవాల్సిన అవసరం ఉంది : ఎలాన్ మస్క్

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విట్టర్ పగ్గాలు.. మళ్లీ ఎలాన్ మస్క్ చేతిలోకి రాగానే ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వచ్చీ రాగానే ఉద్యోగులపై వేటు వేశాడు మస్క్. ఉన్న ఉద్యోగులపై పనిఒత్తిడి పెరగడంతో స్వచ్చంద రాజీనామాలు చేసేందుకు సిద్ధపడుతున్నారు. అయినా పర్వాలేదని కొత్త ఉద్యోగులను తీసుకుంటామని, త్వరలోనే ట్విట్టర్ 2.0ను తీసుకొస్తామని చెప్పారు ఎలాన్ మస్క్. తాజాగా మస్క్.. ట్రంప్ ట్విట్టర్ ఖాతా పునరుద్ధరణపై మాట్లాడారు.

- Advertisement -

అప్పట్లో ఒక దేశ అధ్యక్షుడి హోదాలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఖాతాను బ్యాన్ చేయడం ట్విట్టర్ చేసిన ఘోరమైన తప్పు అన్నారు. 2021 జనవరి 6న అధ్యక్ష ఎన్నిక సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. క్యాపిటల్ భవనంలోకి ఆందోళనకారులు దూసుకెళ్లారు. వారిని రెచ్చగొట్టే విధంగా ట్రంప్ వ్యవహరించారని వార్తలు వచ్చిన నేపథ్యంలో.. ట్రంప్ చేసిన ట్వీట్లు చట్ట వ్యతిరేకంగా ఉన్నాయంటూ ట్విట్టర్ ఆయన ఖాతాని బ్యాన్ చేసింది.

మస్క్ తిరిగి వచ్చాక.. ట్రంప్ ఖాతాను పునరుద్ధరించారు. కానీ.. ట్విట్టర్ కు తిరిగి వచ్చేది లేదని ట్రంప్ చెప్పారు. చెప్పినట్టే.. ఇంతవరకూ ఒక్కట్వీట్ కూడా చేయలేదు. దీనిపై మస్క్ మాట్లాడుతూ..’ట్రంప్ ట్వీట్లు చేయడం లేదు. అయినా పర్వాలేదు. ఒక ఘోరమైన తప్పును ట్విట్టర్ సరిదిద్దుకోవడమనేది చాలా ముఖ్యమైన విషయం. దేశాధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఖాతాను బ్యాన్ చేయడం ద్వారా అమెరికాలోని సగం మంది ప్రజల విశ్వాసాన్ని ట్విట్టర్ కోల్పోయింది. ట్రంప్ చట్ట వ్యతిరేక పనులు చేయలేదు’. అది ట్విట్టర్ చేసిన తప్పని, దానిని సరిదిద్దుకోవాల్సిన అవసరం తమకు ఉందన్నారు. మరి మస్క్ ట్రంప్ ను ఎలా కూల్ చేస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News