Saturday, November 15, 2025
Homeనేషనల్Rahul Gandhi: రాహుల్ గాంధీపై పోలీసు కేసు నమోదు

Rahul Gandhi: రాహుల్ గాంధీపై పోలీసు కేసు నమోదు

అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో చేపట్టిన నిరసన ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. బీజేపీ-కాంగ్రెస్ ఎంపీల మధ్య జరిగిన తోపులాటలో ఒడిశాకు చెందిన బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి తలకు గాయం అయింది. దీంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) తోయడంతోనే తన తలకు గాయం అయిందని ఆయన ఆరోపించారు.

- Advertisement -

అయితే ఈ ఘటనపై బీజేపీ ఎంపీలు అనురాగ్ ఠాకూర్ (Anurag Takur), బన్సూరి స్వరాజ్ (Bansuri Swaraj) పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగానే తోపులాట సృష్టించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad