Homeనేషనల్Delhi: విద్యాశాఖ కార్యాలయంలో అగ్ని ప్రమాదం.. రంగంలోకి 8 ఫైరింజన్లు!

Delhi: విద్యాశాఖ కార్యాలయంలో అగ్ని ప్రమాదం.. రంగంలోకి 8 ఫైరింజన్లు!

Central Education Department: దిల్లీలోని కేంద్ర విద్యాశాఖ కార్యాలయ భవనంలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఐటీఓ పరిధిలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ క్యాంపస్ లో ఉన్న విద్యాశాఖ కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

- Advertisement -

రంగంలోకి 8 ఫైరింజన్లు!: ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే దిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. సుమారు 8 ఫైరింజన్లను హుటాహుటిన ఘటనా స్థలానికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది దాదాపు రెండు గంటల పాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు.

Also read-Gujarat Titans: గుజరాత్ టైటాన్స్ బస్సులో మంటలు.. ప్లేయర్స్ సేఫ్!

సురక్షితంగా బయటపడ్డ సిబ్బంది: ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమయంలో కార్యాలయంలో ఉన్న సిబ్బంది అంతా సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు ధృవీకరించారు. అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News