Machkund Power Station Fire Accident: ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లోని మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పవర్ స్టేషన్‌ను షట్‌డౌన్ చేసిన అనంతరం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ కేంద్రంలోని రెండవ అంతస్తులో దట్టమైన పొగలు, మంటలు అకస్మాత్తుగా వ్యాపించాయి. అక్కడే పలువురు కార్మికులు చిక్కుకుపోయినట్లు సమచారం. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. లోపల చిక్కుకున్న సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి చర్యలు ముమ్మరం చేశారు. సంఘటనకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

