Train Accident In Garibrath: భారత దేశంలో ఈ మధ్యకాలంలో రైల్వే ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. తాజాగా తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ మారడానికి బోగీల నుండి వేరుపడిన ఎక్స్ప్రెస్ ఇంజన్ నుండి మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన లోకో పైలట్ వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ ఈ సంఘటనతో ఒక్కసారిగా భయందోళనకు గురయ్యారు. మరోసారి చెన్నైలో గూడ్స్ ట్రైన్ లో మంటలు చెలరేగాయి.
Readmore: https://teluguprabha.net/national-news/infant-death-camphor-treatment-chennai/
ఈ సంఘటనలు మరువకముందే ఈరోజు రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మేర్ రైల్వే డివిజన్ లోని సెంద్ర స్టేషన్ లో గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ రైల్వే ఇంజిన్ లో మంటలు చెలరేగి భోగీలలో పొగలు వ్యాపించాయి. ఈ ఘటనలో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసారు. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Readmore: https://teluguprabha.net/national-news/rahul-gandhi-slams-govt-ed-chargesheet-vadra/


