HomeTop StoriesSupreme Court: సుప్రీంకోర్టుకు మరో ఐదుగురు కొత్త జడ్జీలు.. కేంద్రానికి కొలీజియం సిఫార్సు

Supreme Court: సుప్రీంకోర్టుకు మరో ఐదుగురు కొత్త జడ్జీలు.. కేంద్రానికి కొలీజియం సిఫార్సు

Five more new judges to the Supreme Court: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రోజురోజుకూ పెరుగుతున్న కేసులు, వాటి పరిష్కారానికి జరుగుతున్న ఆలస్యాన్ని గుర్తించిన కొలీజియం.. సుప్రీం కోర్టుకు మరో ఐదుగురు జడ్జీలను కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు విభిన్న హైకోర్టులకు చెందిన ఐదుగురు సీనియర్ న్యాయమూర్తులను సుప్రీంకోర్టు జడ్జీలుగా పదోన్నతి కల్పించాలని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయితే, కొలీజియం సిఫార్సు చేసిన ఐదుగురు న్యాయమూర్తుల్లో జస్టిస్ ఎస్. మురళీధర్ (ఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి), జస్టిస్ పంకజ్ మిట్టల్ (రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి), జస్టిస్ సంజయ్ కరోల్ (పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి), జస్టిస్ పి.వీ. సంజయ్ కుమార్ (మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి), జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లా (పాట్నా హైకోర్టు న్యాయమూర్తి) ఉన్నారు.

- Advertisement -

Also read: Disha Mouni: ఔనా?.. వారిద్దరూ నిజంగానే లెస్బియన్సా?.. బాలీవుడ్‌ భామలపై నెట్టింట్లో రూమర్స్‌..!

లిస్టు రెడీ.. కేంద్ర కేబినెట్ ఆమోదమే తరువాయి..!

కాగా, సుప్రీంకోర్టులో ప్రస్తుతం పెద్ద ఎత్తున పేరుకుపోయిన కేసుల భారాన్ని తగ్గించడానికి, న్యాయ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి ఈ కొత్త నియామకాలు అత్యంత కీలకమని కొలీజియం తన సిఫార్సుల్లో స్పష్టంగా పేర్కొంది. కొలీజియం పంపిన ఈ ఐదుగురు న్యాయమూర్తుల పేర్లతో కూడిన జాబితాను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ పరిశీలించనుంది. కేంద్ర కేబినెట్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం లభించిన వెంటనే, వీరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నియామకాల ప్రక్రియ పూర్తయితే సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య మరింత పెరగనుంది. తద్వారా, కేసుల పరిష్కారం త్వరితగతన పూర్తి కానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News