Saturday, November 15, 2025
Homeనేషనల్Supreme Court: ఫుట్‌పాత్‌లు, హెల్మెట్లు, హెడ్‌లైట్లు.. రహదారి భద్రతపై సుప్రీంకోర్టు చారిత్రక ఆదేశాలు

Supreme Court: ఫుట్‌పాత్‌లు, హెల్మెట్లు, హెడ్‌లైట్లు.. రహదారి భద్రతపై సుప్రీంకోర్టు చారిత్రక ఆదేశాలు

Supreme Court Issues Landmark Directives on Road Safety: దేశంలో నానాటికీ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలు, వాటి వల్ల సంభవిస్తున్న ప్రాణ నష్టంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రహదారి భద్రతను గాలికొదిలేస్తున్న ప్రభుత్వాల వైఖరిని తప్పుబడుతూ, పాదచారులు, ద్విచక్ర వాహనదారుల భద్రతకు సంబంధించి మంగళవారం చారిత్రక ఆదేశాలను జారీ చేసింది. జస్టిస్ జె.బి. పార్దివాలా, జస్టిస్ కె.వి. విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది.

- Advertisement -

ALSO READ: IPS Officer Suicide: షాకింగ్.. ఇంట్లో తుపాకీతో కాల్చుకుని సీనియర్ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య

2023లో దేశవ్యాప్తంగా 1,72,890 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించగా, వారిలో 20.4 శాతం, అంటే 35,221 మంది పాదచారులే ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో, ఫుట్‌పాత్‌లు పాదచారుల హక్కు అని పునరుద్ఘాటించిన సుప్రీంకోర్టు, దేశంలోని 50 ప్రధాన నగరాల్లో ఫుట్‌పాత్‌లు, పాదచారుల క్రాసింగ్‌లపై వెంటనే ఆడిట్ నిర్వహించాలని మున్సిపల్ కార్పొరేషన్లు, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI)ని ఆదేశించింది. ముఖ్యంగా మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌ల వంటి రద్దీ ప్రదేశాలు, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది.

ద్విచక్ర వాహన ప్రమాద మరణాలలో 70 శాతం హెల్మెట్ ధరించకపోవడం వల్లే జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాసనం, హెల్మెట్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తేల్చి చెప్పింది. ఇ-ఛలాన్ల కోసం కెమెరాలను విరివిగా ఉపయోగించాలని సూచించింది.

ALSO READ: Landslide: హిమాచల్‌లో ఘోర విషాదం.. కొండచరియలు విరిగిపడి బస్సు ధ్వంసం, 18 మంది మృతి

ఇక రాంగ్ రూట్ డ్రైవింగ్, ప్రమాదకరమైన ఓవర్‌టేకింగ్‌లను అరికట్టడానికి ఆటోమేటెడ్ కెమెరాలు, టైర్ కిల్లర్లు వంటివి ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అదేవిధంగా, ఇతరులను భయపెట్టేలా, కళ్ళు జిగేల్మనిపించేలా ఉండే అక్రమ ఎల్ఈడీ హెడ్‌లైట్లు, సైరన్ల వాడకంపై కఠిన చర్యలు తీసుకోవాలని, వాటి ప్రకాశంపై నిర్దిష్ట ప్రమాణాలను నిర్దేశించాలని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖకు సూచించింది. ఫుట్‌పాత్‌ల నిర్వహణపై వచ్చే ఫిర్యాదుల కోసం ఆన్‌లైన్ గ్రీవెన్స్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసి, నిర్దిష్ట గడువులోగా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించింది. ఈ ఆదేశాల అమలును పర్యవేక్షించేందుకు ఏడు నెలల తర్వాత కేసును మళ్లీ విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.

ALSO READ: Indian Railways: ఇకపై బుక్ చేసిన టికెట్ల ప్రయాణ తేదీని మార్చుకోవచ్చు.. రైల్వే చరిత్రలో తొలిసారి..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad