ఇటీవల వారసత్వంపై మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. తాజాగా ఆ వ్యాఖ్యలపై మాజీ ఐపీఎస్ కిరణ్ బేడీ(Kiran Bedi) తీవ్రంగా స్పందించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
“చిరంజీవి గారు, దయచేసి కూతురు కూడా ఒక వారసత్వమేనని నమ్మడం ప్రారంభించండి. అదంతా మీరు కూతురిని ఎలా పెంచుతారు. ఆమె ఎలా అభివృద్ధి చెందుతుందో దానిపై ఆధారపడి ఉంటుంది. తమ కూతుళ్లను పెంచి, వారిని బాగా చూసుకుని, వారి కుటుంబాలను గర్వపడేలా చేసిన తల్లిదండ్రుల నుండి నేర్చుకోండి.” అని సూచించారు. ఈ అంశంపై కిరణ్ బేడీ ఘాటుగా స్పందించడంతో హాట్ టాపిక్‌గా మారింది.
కాగా ‘బ్రహ్మా ఆనందం’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి మాట్లాడుతూ.. “ఇంట్లో నా పరిస్థితి లేడీస్ వార్డెన్ లెక్క అయిపోయింది. నా చుట్టూ మొత్తం ఆడపిల్లలే. చరణ్‌ని ఒక్కోసారి అడుగుతుంటాను. దయచేసి ఈసారి ఒక అబ్బాయిని కనురా మన లెగసీని ముందుకు కొనసాగించాలి. మళ్ళీ ఆడపిల్ల పుడుతుందేమో అని భయం వేస్తుంది” అని సరదాగా వ్యాఖ్యానించారు.