కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గిరిజా వ్యాస్(Girija Vyas) అగ్నిప్రమాదంలో గాయపడ్డారు. ఉగాది పండుగ సందర్భంగా రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో తన నివాసంలో పూజ సమయంలో హారతి నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. ఇంట్లో ఆమె హారతి ఇస్తుండగా.. దీపం మంటలు ఆమె దుపట్టాకు అంటుకోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
- Advertisement -
దీంతో కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను అహ్మదాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాగా గిరిజా వ్యాస్ గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రిగా సేవలందించారు. రాజస్థాన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా, జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గానూ పనిచేశారు.