ఛత్తీస్గడ్ లో మరోసారి తుపాకుల మోత మోగింది. శనివారం ఉదయం 8 గంటలకు బస్తర్ రీజన్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు (Maoists) ప్రాణాలు కోల్పోయారు. కాంకేర్, నారాయణపూర్ జిల్లాల మధ్యనున్న ఉత్తర అంబుజ్ మడ్ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమైనట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది.
దీంతో బీఎస్ఎఫ్, డీఆర్జీఎఫ్, టీఎస్ఎఫ్ బలగాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ జాయింట్ ఆపరేషన్లో నలుగురు మావోయిస్టులు (Maoists) చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ఛత్తీస్గడ్ లోని బస్టర్ రీజన్ మావోయిస్టులకు ఒకప్పుడు కంచుకోటగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ ప్రాంతంలో తరచూ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. మావోయిస్టు పార్టీ భారీగా ప్రాణనష్టం చవిచూస్తోంది.