GATE 2027 exam schedule release: దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎస్సీ వంటి ఉన్నత విద్యా సంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల అర్హతగా పరిగణించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) పరీక్షకు సంబంధించిన రిజిస్ట్రేషన్ షెడ్యూల్‌ను ఐఐటీ మద్రాస్ రిలీజ్ చేసింది. ఈసారి గేట్ పరీక్షను ఐఐటీ మద్రాస్ నిర్వహించనుంది. అయితే, తొలుత ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆగస్టు 14 నుంచి ప్రారంభమవుతుందని షెడ్యూల్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు సవరించిన షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. ఈ కొత్త షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని ప్రకటించింది. అర్హులైన అభ్యర్థులంతా ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 27వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఆలస్య రుసుంతో అక్టోబర్ 5వరకు దరఖాస్తు చేసుకోవచ్చని., పరీక్ష తేదీల్లో మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది.
Also Read: Tamil Nadu village: పెళ్లి కాని యువత మద్యం తాగితే 5 వేలు ఫైన్.. తమిళనాడులోని ఓ గ్రామంలో వెరైటీ రూల్
రిజిస్ట్రేషన్‌కు డిజిలాకర్ తప్పనిసరి..
అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 14 నుంచి ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులను చేసుకోవచ్చని, సాధారణ ఫీజుతో ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించడానికి సెప్టెంబర్ 21ని ఆఖరి తేదీగా ప్రకటించింది. ఇక, ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఒకవేళ, అప్లికేషన్‌లో తప్పులుంటే సరిచేసుకోవడానికి అక్టోబర్ 14 నుంచి 21 వరకు కరెక్షన్ విండో అందుబాటులో ఉండనుంది. కాగా, ‘గేట్’ పరీక్షలను వచ్చే ఏడాది ఫిబ్రవరి 6, 7, 13, 14, 20, 21 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత విధానంలో (సీబీటీ) విధానంలో నిర్వహించనున్నారు. ఎగ్జామ్ సెంటర్, ఇతర వివరాలను జనవరి 4న అధికారికంగా వెల్లడించనుండగా, మార్చి 19న రిజల్ట్స్ విడుదల కానున్నాయి. ఈ సారి మొత్తం 30 సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహించనుండగా, అందులో కొత్తగా ‘రొబోటిక్స్ అండ్ ఆటోమేషన్’ సబ్జెక్ట్‌ను సైతం చేర్చారు. కాగా, ఈసారి గేట్ రిజిస్ట్రేషన్‌కు డిజిలాకర్ తప్పనిసరి చేసింది ఐఐటీ మద్రాస్. అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందే వెబ్‌సైట్‌లో తమ డిజిలాకర్ ఖాతాను క్రియేట్ చేసుకోవాలని సూచించింది.

