పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ ఇటీవల కశ్మీర్‌పై చేసిన వ్యాఖ్యలు.. మరోసారి భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతకు దారితీశాయి. ఇస్లామాబాద్‌లో జరిగిన ఓవర్సీస్ పాకిస్థానీస్ కన్వెన్షన్‌లో మునీర్ మాట్లాడుతూ.. కశ్మీర్ పాకిస్థాన్‌కు జీవనాడి అని.. భవిష్యత్తులోనూ అదే స్థితి కొనసాగుతుందని అన్నారు. దానిని మేము వదిలిపెట్టబోమని అని పేర్కొన్నారు. ఆయన ఈ సందర్భంగా పాకిస్థాన్ సాంస్కృతిక విలువలు, పూర్వీకుల త్యాగాలను గుర్తుచేస్తూ, విదేశాల్లో నివసిస్తున్న పాకిస్థానీయులు తమ పిల్లలకు పాక్ స్టోరీ చెప్పాలని సూచించారు.
తాజాగా ఈ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తీవ్రంగా స్పందించారు. కశ్మీర్ భారతదేశానికి విడదీయరాని భాగమని పేర్కొన్నారు. పాకిస్థాన్‌తో కశ్మీర్‌కు ఉన్న ఏకైక సంబంధం వారు చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భూభాగాన్ని ఖాళీ చేయడమే అని స్పష్టం చేశారు. విదేశీ భూభాగాన్ని జీవనాడిగా పరిగణించడం అర్థరహితం అని ఆయన మండిపడ్డారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా ఈ అంశంపై స్పందిస్తూ భారతదేశం ఇప్పటికైనా సత్యాన్ని అంగీకరించి, పాకిస్థాన్‌తో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవాలనే ఆశను వదులుకోవాలి అని అన్నారు.
తాజా పరిణామాలు భారత్–పాక్ సంబంధాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతను మరింత బలపరిచాయి. కశ్మీర్ అంశం పట్ల పాకిస్థాన్ తరచూ వ్యాఖ్యలు చేస్తూ, భారతదేశం అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందని భారత్ ఆరోపిస్తోంది.