Homeనేషనల్CDS: నూతన సీడీఎస్‌గా లెఫ్టినెంట్ జనరల్‌ రాజా సుబ్రమణి

CDS: నూతన సీడీఎస్‌గా లెఫ్టినెంట్ జనరల్‌ రాజా సుబ్రమణి

General Raja Subramani: దేశ రక్షణ రంగంలో అత్యున్నత పదవి అయిన చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (CDS)గా జనరల్‌ ఎన్‌.ఎస్. రాజా సుబ్రమణి(రిటైర్డ్‌) బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు సీడీఎస్‌గా సేవలందించిన జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ పదవీకాలం మే 30తో ముగియడంతో.. ఆయన స్థానంలో రాజా సుబ్రమణి ఈ కీలక బాధ్యతలను చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.

- Advertisement -

40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం: నూతన సీడీఎస్‌ జనరల్‌ రాజా సుబ్రమణికి భారత సాయుధ దళాల్లో విశేషమైన ట్రాక్ రికార్డ్ ఉంది. ఇండియన్ ఆర్మీలో ఆయనకు దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. దేశ రక్షణకు సంబంధించిన పలు అత్యంత కీలకమైన, వ్యూహాత్మక ఆపరేషన్లను ఆపరేట్ చేయడంలో ఆయన గతంలో కీలక పాత్ర పోషించారు. మిలిటరీ కమాండ్‌లో వివిధ ఉన్నత స్థాయి పదవులను సమర్థవంతంగా నిర్వహించిన ఆయన.. ఇప్పుడు ముక్కోణపు దళాల (ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్) సమన్వయకర్తగా దేశ రక్షణ వ్యూహాలను నడిపించనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News