Affairs: ఇటీవలి కాలంలో వివాహ బంధం పవిత్రత ప్రశ్నార్థకమవుతోంది. అన్యోన్యంగా ఉండాల్సిన భార్యాభర్తలు కాస్తా.. వైలెంట్‌గా మారి దాడులు చేసుకోవడం, ఘోరమైన హత్యలకు పాల్పడటం చూస్తుంటే, అసలు ఈ ‘బంధం’ ఎటు పోతోందో అనే భయం పట్టుకుంది. ముఖ్యంగా, ‘వివాహేతర సంబంధాలు’ (Extramarital Affairs) పెరగడం ఈ పవిత్ర బంధాన్ని మరింత బలహీనపరుస్తున్నాయి. కేవలం ‘పడక సుఖం’ కోసం దేనికైనా తెగించేస్తున్న ఈ ధోరణిపై గ్లీడెన్ (Gleeden) అనే అంతర్జాతీయ డేటింగ్ సంస్థ నిర్వహించిన సర్వే సంచలన విషయాలను వెల్లడించింది.
దేశంలో ఎఫైర్లకు హబ్ ఏది?
పెళ్లయిన తర్వాత కూడా చాలా మంది ‘పక్క చూపులు’ చూస్తున్నారని గ్లీడెన్ సంస్థ తేల్చింది. ఈ ఎఫైర్ల విషయంలో మన దేశంలోని ప్రధాన నగరాల ర్యాంకింగ్‌ను పరిశీలిస్తే షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
దేశంలోనే టెకీ హబ్‌గా పిలవబడే బెంగళూరు ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. బెంగళూరు తర్వాత ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, పుణె నగరాలు వరుసగా ఉన్నాయి.ముఖ్యంగా, ఐటీ (IT) , వైద్య (Medical) రంగాల్లో పనిచేసే నిపుణులే ఎక్కువగా ఈ వివాహేతర సంబంధాలను కొనసాగిస్తున్నారని ఈ డేటింగ్ యాప్ తన నివేదికలో స్పష్టం చేసింది.పెళ్లైన తర్వాత భాగస్వామిని మోసం చేయడానికి ప్రధాన కారణాలను ఈ సర్వే విశ్లేషించింది.ఐటీ వంటి రంగాల్లో తీవ్రమైన పని ఒత్తిడి, నిత్యం టెన్షన్‌తో ఉండటం. కుటుంబానికి, భాగస్వామికి తగినంత సమయం కేటాయించలేకపోవడం.భాగస్వామి మానసిక, శారీరక అవసరాలను విస్మరించడం. కుటుంబంలో కలహాలు పెరగడం, విడాకుల భయంతో కొంతమంది బయట సాంత్వన వెతుక్కుంటున్నారు.
నిపుణుల ఆందోళన
ఈ ధోరణిపై నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివాహ వ్యవస్థ బలహీనపడటం ఒక ఎత్తైతే, ఈ విధంగా తప్పుడు మార్గంలో వెళ్లడం వలన అనారోగ్యకరమైన లైంగిక సంక్రమణ వ్యాధులను (STD’s) కొనితెచ్చుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
భార్యాభర్తల మధ్య గొడవలు, హత్యలు పెరిగిపోతున్న ప్రస్తుత సమాజంలో, యువత, యువతులు మరింత ‘మెచ్యూర్డ్’గా ఆలోచించాలని, జీవితాన్ని, బంధాలను సీరియస్‌గా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం ఈ గ్లీడెన్ సర్వే రిపోర్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ నివేదిక చూసిన చాలా మంది.. తమ వైవాహిక జీవిత భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. పవిత్రమైన బంధాన్ని కాపాడుకోవడానికి భాగస్వాములు ఇద్దరూ కలిసి కూర్చుని చర్చించుకోవడం అత్యంత అవసరం.


