Saturday, November 15, 2025
Homeనేషనల్వెడ్డింగ్ షూటా.. వల్గారిటీ షూటా..? ఇంత దారుణంగా ఉన్నారేంటి భయ్యా..!

వెడ్డింగ్ షూటా.. వల్గారిటీ షూటా..? ఇంత దారుణంగా ఉన్నారేంటి భయ్యా..!

జీవితంలో ఒకసారి మాత్రమే జరిగే కార్యక్రమం వివాహం. ఆ జ్ఞాపకాలను పదిలంగా దాచుకోవడం కోసం ఫోటోలు, వీడియోలు తీయించుకోవడం పరిపాటి. అయితే ప్రస్తుతం దానికి కొనసాగింపుగా (pre-wedding shoots) ప్రీ వెడ్డింగ్ షూట్‌ల ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని సార్లు ప్రీ వెడ్డింగ్ షూట్‌‌ పేరుతో జరిగే హంగామా హద్దులు దాటుతుంది. పవిత్రంగా భావించే ఈ పెళ్లి తంతును ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో అసహ్యించుకునే స్థాయికి తీసుకొస్తున్నారు. అందరి కంటే భిన్నంగా షూట్ చేసుకోవాలని.. శ్మశానాలు, ఎడారులు, మురికి గుంటల్లో షూట్‌లు చేస్తున్నారు. కొంత మంది సముద్రాలు, నదులు, కొండలు వంటి ప్రదేశాల్లో షూట్ చేయించుకుంటూ కొందరు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. బైక్‌లపై స్టంట్స్ చేస్తూ షూట్‌లు చేయించుకోని మరి కొందరూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.

- Advertisement -

కపుల్స్ మధ్య కెమిస్ట్రీ ప్రీ వెడ్డింగ్‌: ఇక కపుల్స్ మధ్య కెమిస్ట్రీ ఉండాలని హద్దులు మీరిన కెమిస్ట్రీని చూపిస్తున్నారు. సెమీ న్యూడ్‌గా ఉండే ఫ్రి వెడ్డింగ్ (Pre Wedding shoot) షూట్స్ సైతం కొందరు తీసుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియోలు, ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ క్రేజీ ప్రీ వెడ్డింగ్ షూట్ చూసి నెటిజన్లు అవాక్కయ్యారు. గోవా బీచ్‌లో ఓ కపుల్ హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోయారు. ఫిట్‌నెస్ ప్రియులైన ఈ జంట బీచ్‌లో రొమాంటిక్ ఫోజులతో రెచ్చిపోయారు. వదువు ఇచ్చిన స్టిల్స్ అందరినీ షాక్ కి గురి చేసింది. వారిద్దరి కెమిస్ట్రీ, వరల్డ్ టాప్ మోడల్స్‌గా ఈ ఫోటో షూట్‌లో జంట కన్పిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు తాజాగా నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ ఫోటోలను చూసి నెటిజన్లు షాక్‌కు గురయ్యారు.

https://www.instagram.com/p/DI3o3p8T4wt/?img_index=1

ప్రి వెడ్డింగ్ షూట్‌లు ఈ మధ్య శృతి మించుతున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. ఎవరి ఇష్టం వారిది, జంటకు నచ్చిన విధంగా ప్రీ వెడ్డింగ్ చేసుకుంటారని మరికొందరు నెటిజన్లు వారిని ఫోటో షూట్‌ను మెచ్చుకుంటున్నారు. ఫోటో షూట్ అందరికీ ఆనందాన్ని ఇచ్చేలా ఉండాలని, ఇలా శృతి మించిన కెమిస్ట్రీతో షూట్స్ చేయించుకుంటే.. తర్వాత అనుకోని కారణాలతో వివాహం ఆగిపోతే పరిస్థితి ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ ఫోటో షూట్ పై మీరేమంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad