దేశంలో ప్రతి ఇంట్లో వంటిల్లు తప్పని సరిగా ఉంటుంది.. అలాగే ఏ వంటకం చేయాలన్నా నూనె తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే గత కొన్ని సంవత్సరాలుగా మన దేశంలో వంట నూనె ధరకు భారీగా పెరగడంతో.. వంట గది బడ్జెట్ మరింతగా పెరుగుతుంటుంది. మన దేశంలో వినియోగించే వంటనూనెలో 60 శాతానికిపైగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నదే.
అందే దీని ధర నిత్యం మార్పు చెందుతూనే ఉంటుంది. అయితే తాజాగా మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం, నూనె గింజల ధరలు తగ్గడం వంట నూనె ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. గిరాకీ, సరఫరా, దిగుమతులపై ఆధారపడి ధరలు మారతాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల ప్రభావం ఉంటుంది. మరికొన్ని రోజుల్లో సరఫరా పెరిగితే, వంట నూనెల ధరలు కాస్త తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం వంట నూనెల ధరలు భారీగా పెరిగాయి. అయితే తాజాగా నూనె గింజల ఉత్పత్తి ధరలు కనీస మద్దతు రేటు కంటే తక్కువగా అమ్ముడవుతున్నాయి. దీంతో త్వరలో వంట నూనె ధరలు తగ్గే అవకాశముందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో నూనె గింజల ధరలు పెరిగినా, దేశీయంగా మాత్రం పలు రకాల నూనె గింజల ధరలు తగ్గాయి. శుక్రవారం దేశీయ మార్కెట్లో దాదాపు అన్ని రకాల నూనె గింజల రేట్లు తగ్గుముఖం పట్టాయి. కానీ MSP కంటే తక్కువ ధరలకు రైతులు తమ ఉత్పత్తులను విక్రయించాల్సి వస్తోంది.
ఇక దిగుమతుల విషయానికి వస్తే, దిగుమతిదారులు సోయాబీన్ డీగమ్ ఆయిల్‌ను దిగుమతి ఖర్చు కంటే 4-5% తక్కువ ధరకు అమ్ముతున్నారు. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది నిధుల కొరత వల్ల ఏర్పడిన పరిస్థితిగా చెబుతున్నారు. సోయాబీన్ MSP క్వింటాల్‌కు రూ. 4,892 ఉండగా, స్పాట్ మార్కెట్‌లో దీని ధర 15-18% తక్కువగా, అంటే దాదాపు రూ. 4,000కి అమ్ముతున్నారు. పొద్దుతిరుగుడు పంట MSP కంటే 20% తక్కువ ధరకు విక్రయమవుతోంది.
వేరుశనగ ఉత్పత్తులు MSP కంటే 22-23% తక్కువ ధరకు మార్కెట్లో అమ్ముడవుతున్నాయి. ఆవాల గింజల ధరలు మాత్రం డిమాండ్, సరఫరా ఆధారంగా సమతుల్యతను కాపాడుతున్నాయి. ఇక పత్తి మార్కెట్ విషయానికి వస్తే, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) గత మూడు రోజుల్లో పత్తి ధరను రూ. 225 పెంచింది. స్పాట్ మార్కెట్‌లో పత్తి గింజల ధరలు బలంగా ఉన్నప్పటికీ, ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో మాత్రం గురువారం 0.5%, శుక్రవారం 1% మేర తగ్గాయి. హర్యానా, పంజాబ్‌లలో పత్తి విత్తనాల ధరలు ఎక్కువగా ఉండటంతో, పత్తి ఉత్పత్తుల ధరలు స్థిరంగా ఉన్నాయి.