Sunday, July 7, 2024
Homeనేషనల్Gotabaya Rajapaksa : గొట‌బయ రాజ‌ప‌క్స‌కు షాకిచ్చిన సుప్రీం కోర్టు

Gotabaya Rajapaksa : గొట‌బయ రాజ‌ప‌క్స‌కు షాకిచ్చిన సుప్రీం కోర్టు

Gotabaya Rajapaksa : శ్రీలంక మాజీ అధ్య‌క్షుడు గొట‌బ‌య రాజ‌ప‌క్స‌కు ఆ దేశ సుప్రీం కోర్టు షాకిచ్చింది. తాను అధ్య‌క్షుడిగా ఉన్న స‌మ‌యంలో ఓ ఖైదీకి క్ష‌మాబిక్ష పెట్టిన కేసులో ఆయ‌న‌కు ఆ దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం స‌మ‌న్లు జారీ చేసింది. ఈ కేసులో రాజ‌ప‌క్స‌కు స‌మ‌న్లు జారీ చేయ‌డం ఇది రెండోసారి. దీంతో గొట‌బాయ రాజ‌ప‌క్స డిసెంబ‌ర్ 16న న్యాయ‌స్థానంలో హాజ‌రయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.

- Advertisement -

మాజీ ఎంపీ ప్రేమ‌చంద్ర స‌న్నిహితుడైన‌ భరత లక్ష్మణ్ ప్రేమచంద్రను 2011లో శ్రీలంక పొడుజ‌న పెర‌మున పార్టీకి చెందిన దుమిండ సిల్వ హ‌త్య చేశాడు. విచార‌ణ అనంత‌రం 2017లో దుమిండ సిల్వకు న్యాయ‌స్థానం మ‌ర‌ణ‌శిక్ష విధించింది. అయితే.. 2021లో అధ్య‌క్షుడి హోదాలో ఉన్న గొట‌బాయ రాజ‌ప‌క్స నిందితుడికి క్ష‌మాభిక్ష పెట్టారు.

రాష్ట్రపతి క్షమాభిక్షకు వ్యతిరేకంగా హిరునికా ప్రేమచంద్ర, ఆమె తల్లి సుమనా ప్రేమచంద్ర, మాజీ మానవ హక్కుల కమిషనర్ గజాలీ హుస్సేన్ లు సుప్రీం కోర్టులో పిటిష‌న్లు దాఖ‌లు చేశారు. ఈ పిటీష‌న్ల‌పై విచార‌ణ చేప‌ట్టిన శ్రీలంక సుప్రీం కోర్టు 2022 మే 31న దుమిండ సిల్వకు రాష్ట్ర‌ప‌తి పెట్టిన క్ష‌మాభిక్ష‌ను నిలిపివేస్తూ మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది. అత‌డి విదేశీ ప్ర‌యాణాల‌పై నిషేదం విధించింది. సిల్వాను మ‌ళ్లీ అరెస్టు చేయాల‌ని ఆదేశించింది. అప్పుడే రాజ‌ప‌క్స‌కు స‌మ‌న్లు జారీ చేసింది.

దేశంలో ఆర్థిక సంక్షోభం త‌లెత్త‌డంతో రాజ‌ప‌క్స‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌కు మిన్నంట‌డంతో 73 ఏళ్ల ఆయ‌న జూలైలో శ్రీలంక వదిలి పారిపోయాడు. మాల్దీవుల‌కు వెళ్లిన ఆయ‌న సింగ‌పూర్ నుంచి త‌న రాజీనామాను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News