Holiday: బడి పిల్లలకు, ఉద్యోగులకు మరో తీపి కబురు అందింది. రేపు (జులై 6) విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులకు సెలవు లభించనుంది. అయితే ఈ సెలవు దేశవ్యాప్తంగా కాకుండా.. ఒక నిర్దిష్ట రాష్ట్రానికి మాత్రమే వర్తిస్తుంది. ప్రముఖ జాతీయవాద నేత శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిని పురస్కరించుకుని ఈ అధికారిక సెలవును ప్రకటించారు.
పశ్చిమ బెంగాల్‌లో జులై 6న ప్రభుత్వ సెలవు: ప్రముఖ నేత శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా జులై 6ని అధికారిక సెలవు దినంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూతపడనున్నట్లు అక్కడి ఆర్థిక శాఖ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
Also read-Bank Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. IBPS నుంచి భారీ నోటిఫికేషన్!
శ్యామా ప్రసాద్ ముఖర్జీ నేపథ్యం: పశ్చిమ బెంగాల్‌కు చెందిన శ్యామా ప్రసాద్ ముఖర్జీ దేశంలోనే అత్యంత ప్రసిద్ధ జాతీయవాద నేతలలో ఒకరు. ఆయన గొప్ప న్యాయవాదిగా, విద్యావేత్తగా, రాజకీయవేత్తగా దేశానికి సేవలందించారు. స్వాతంత్ర్యానంతరం దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ మంత్రివర్గంలో ఆయన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. దేశ రాజకీయాల్లో ఆయన పోషించిన విశిష్ట పాత్రకు గుర్తుగా బెంగాల్ ప్రభుత్వం ఈ గౌరవాన్ని ప్రకటించింది.

