Homeనేషనల్Summons : మెటాకు కేంద్రం షాక్... దిల్లీ విచారణకు రావాల్సిందే!

Summons : మెటాకు కేంద్రం షాక్… దిల్లీ విచారణకు రావాల్సిందే!

Meta Global Leadership Summons India IT Ministry :  ప్రపంచ టెక్ దిగ్గజం ‘మెటా’ (Meta) యాజమాన్యానికి భారత కేంద్ర ప్రభుత్వం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ‘సాంకేతిక లోపం’ అని నెపం నెట్టి చేతులు దులుపుకోవాలనుకున్న డిజిటల్ దిగ్గజంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. సాక్షాత్తూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక ఖాతాలోని కీలక వీడియో పోస్ట్‌ను ఆటోమేటెడ్ అల్గోరిథమ్స్ పేరుతో డిలీట్ చేయడం నుంచి.. ఇన్‌స్టాగ్రామ్‌లో బాలల భద్రత మృగ్యమవడం వరకు వరుస వివాదాలు చుట్టుముట్టడంతో మెటా అమెరికా గ్లోబల్ లీడర్‌షిప్‌కు అత్యవసర నోటీసులు జారీచేసింది.

- Advertisement -

ప్రధాని పోస్ట్ డిలీట్.. ఆ తర్వాత ఆటోమేటెడ్ నాటకం : పేపర్ లీకేజీలు, పరీక్షల పారదర్శకతపై దేశ యువతకు ధైర్యం చెబుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో షేర్ చేసిన ప్రత్యేక వీడియో పోస్ట్‌ను మెటా ఆటోమేటెడ్ కంటెంట్ ఫిల్టర్లు హఠాత్తుగా భారతదేశంలో ఆపేశాయి. ‘చట్టపరమైన అభ్యర్థన వల్ల మీ ప్రాంతంలో ఈ కంటెంట్ లభ్యం కావడం లేదు’ అని వింత సందేశం చూపించడంతో తీవ్ర గందరగోళం చెలరేగింది. అంతర్జాతీయంగా వినియోగదారులకు కనిపించిన ఆ వీడియో, భారతదేశంలో మాత్రం ప్రదర్శితం కాకపోవడం వెనుక మెటా ఆల్గోరిథమ్‌ల కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

తీవ్ర నిరసన వ్యక్తమైన అనంతరం, “అది కేవలం ఒక చిన్న సాంకేతిక పొరపాటు” అని మెటా క్షమాపణలు చెబుతూ ప్రకటన విడుదల చేసింది. అయితే, కోట్ల మంది ప్రతిరోజూ ఉపయోగించే వేదికపై ఒక దేశ ప్రధాని సందేశాన్నే తీసివేయడం ‘సాంకేతిక లోపం’ అంటే సరిపోదని, ‘చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు’ మెటా వ్యవహరిస్తోందని ఐటీ మంత్రిత్వ కార్యదర్శి ఎస్. క్రిష్ణన్ ఘాటుగా స్పందించారు.

సాంకేతిక లోపం’ సాకు చెల్లదు: కేంద్రం ఖరాకండీ హెచ్చరిక : మెటా ఇచ్చిన వివరణను కేంద్ర ఐటీ శాఖ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. “భారత డిజిటల్ సార్వభౌమత్వాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందే. ఆటోమేటెడ్ సాఫ్ట్‌వేర్ కంటెంట్ మోడరేషన్ ఎలా పనిచేస్తోందో పక్కా ఆధారాలతో నిరూపించాలి” అని ఆదేశించింది.

ఆల్గోరిథమిక్ పక్షపాతం : మెటా వేదికలు ఏకపక్షంగా, రాజకీయ పక్షపాతంతో పనిచేస్తున్నాయా? విద్వేష కంటెంట్‌ను నియంత్రించడంలో విఫలమై, ప్రామాణిక ప్రొఫైల్స్‌పై ఉద్దేశపూర్వక ఆంక్షలు విధిస్తున్నాయా? అనే అంశంపై కఠిన వివరణ కోరనున్నారు. లక్షలాది రూపాయల ప్రకటనల రాబడి పొందుతున్న సంస్థ, తన అల్గోరిథమ్‌ల లోపాలను సరిదిద్దకుండా కేవలం సాంకేతిక కారణాలు చెప్పడం బాధ్యతారాహిత్యమని కేంద్రం స్పష్టం చేసింది.

ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ముప్పులు – ఐటీ శాఖ సమగ్ర విచారణ : కేవలం ప్రధాని పోస్ట్ డిలీషన్ మాత్రమే కాకుండా, మెటా యాజమాన్యంలో నడుస్తున్న ఇతర వేదికల భద్రతా లోపాలపైనా కేంద్రం గురిపెట్టింది. ఇన్‌స్టాగ్రామ్ ప్రకటనల వేదికగా బాలల లైంగిక శోషణను ప్రోత్సహించే మెటీరియల్ (CSEAM) చలామణి కావడంపై గతంలోనే ఐటీ శాఖ తీవ్ర నోటీసులు ఇచ్చింది. దీనిపై మెటా తీసుకున్న చర్యలను ప్రత్యక్షంగా సవాలు చేయనున్నారు.

వాట్సాప్ నూతన ఫీచర్లు – సైబర్ ముప్పు: వాట్సాప్‌లో ప్రతిపాదిత యూజర్‌నేమ్ (Username) ఫీచర్లు, ఎన్‌క్రిప్షన్ ముసుగులో జరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడానికి మెటా తీసుకుంటున్న నివారణ చర్యలను పరిశీలించనున్నారు.

ఏఐ డీప్‌ఫేక్స్ నిరోధక చర్యలు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పేరుతో ప్రచారమవుతున్న నకిలీ వీడియోలు, డీప్‌ఫేక్స్ నిరోధానికి ఐటీ రూల్స్-2021కి అనుగుణంగా మెటా తీసుకున్న చర్యలపై క్షేత్రస్థాయి రిపోర్టు సమర్పించాల్సి ఉంటుంది.

భారత చట్టాలకు లోబడాల్సిందే: ‘సేఫ్ హార్బర్’ రక్షణకు ముప్పు? : భారతదేశంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు చట్టపరమైన మినహాయింపు (Safe Harbour Status under Section 79 of IT Act) పొందాలంటే, ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను, కంటెంట్ మోడరేషన్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News