Saturday, November 15, 2025
Homeనేషనల్Engagement Cancelled: మెనూలో మటన్ బిర్యానీ, ఫ్రైడ్ ఫిష్ లేదని నిశ్చితార్థం రద్దు చేసుకున్న వరుడు

Engagement Cancelled: మెనూలో మటన్ బిర్యానీ, ఫ్రైడ్ ఫిష్ లేదని నిశ్చితార్థం రద్దు చేసుకున్న వరుడు

Groom Calls Off Engagement No Mutton Biryani On Menu: ఉత్తర్ ప్రదేశ్‌లోని హాపుర్ జిల్లాలో ఆహారం విషయంలో తలెత్తిన గొడవ కారణంగా పెళ్లి నిశ్చితార్థం రద్దైంది. నిశ్చితార్థ మెనూలో మటన్ బిర్యానీ, ఫ్రైడ్ ఫిష్ లేకపోవడంతో వరుడి తరఫు వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, పెళ్లిని రద్దు చేసుకున్నారు.

- Advertisement -

గొండీ సలై గ్రామానికి చెందిన ఇక్రా పర్వీన్ పెళ్లి, గఢ్‌ముక్తేశ్వర్‌లోని అహతసైనీ గ్రామానికి చెందిన యువకుడితో అక్టోబర్ 17న జరగాల్సి ఉంది. అయితే, నిశ్చితార్థం రోజున వరుడి తరఫు వారు పెళ్లిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

నిన్న (సోమవారం) నిశ్చితార్థ వేడుక కోసం వరుడి తరఫు వారు ముస్లిం సంప్రదాయంలో ఉపయోగించే ఆహ్వాన పత్రం ‘లాల్ ఖత్’తో వధువు ఇంటికి చేరుకున్నారు. అంతా సంతోషంగా ఉన్న సమయంలో, వారికి ఆహారం వడ్డించిన తర్వాత గొడవ మొదలైంది. మెనూలో మటన్ బిర్యానీ, ఫ్రైడ్ ఫిష్ లేకపోవడాన్ని గమనించిన వరుడి బంధువులు పెద్ద గొడవకు దిగారు.

ALSO READ: Indian Railways: ఇకపై బుక్ చేసిన టికెట్ల ప్రయాణ తేదీని మార్చుకోవచ్చు.. రైల్వే చరిత్రలో తొలిసారి..

ఖరీదైన డిమాండ్లు, రద్దైన పెళ్లి

వధువు తరఫు బంధువు ఫైసల్ చౌదరి మాట్లాడుతూ, తాము వరుడి కుటుంబం కోరిన బుల్లెట్ మోటార్‌సైకిల్, స్కార్పియో కారు వంటి అనేక డిమాండ్లను ఇప్పటికే నెరవేర్చామని తెలిపారు. అయినప్పటికీ, తమకు బిర్యానీ, చేపలు వడ్డించకపోతే తాము బారాత్ (పెళ్లి ఊరేగింపు) తీసుకురాబోమని వరుడి తరఫు వారు మొండికేశారని ఆయన అన్నారు.

సుమారు 40 మంది వరుడి తరఫు సభ్యులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఆహారం విషయంలో మొదలైన ఈ వాగ్వాదం కాసేపట్లోనే పెద్ద గొడవగా మారిందని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాల వాదనలు విన్నారు.

పెళ్లి జరగడానికి కేవలం పది రోజుల ముందు, ఆహారం విషయంలో తలెత్తిన ఈ వివాదం కారణంగా ఇరు కుటుంబాల మధ్య సంబంధం అకస్మాత్తుగా ముగిసింది. ఈ ఘటనపై తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ విజయ్ గుప్తా తెలిపారు.

ALSO READ: Supreme Court: ఫుట్‌పాత్‌లు, హెల్మెట్లు, హెడ్‌లైట్లు.. రహదారి భద్రతపై సుప్రీంకోర్టు చారిత్రక ఆదేశాలు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad