Saturday, May 17, 2025
Homeనేషనల్పెళ్లిలో విషాదం.. తాళి కట్టిన కాసేపటికే వరుడు మృతి.. ఎలాగంటే..?

పెళ్లిలో విషాదం.. తాళి కట్టిన కాసేపటికే వరుడు మృతి.. ఎలాగంటే..?

కర్ణాటక రాష్ట్రంలోని బాగల్‌కోట్‌ లో విషాధం చోటుచేసుకుంది. జీవితాంతం ఆనందంగా ఉండాలని ఆశలతో ప్రారంభమైన పెళ్లి వేడుక ఒక్కసారిగా విషాదంలోకి మారింది. శనివారం కర్ణాటక రాష్ట్రంలోని జామ్‌ఖండి పట్టణంలో ఓ వరుడు, తాళి కట్టిన కాసేపటికే మృతిచెందిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 25 ఏళ్ల ప్రవీణ్ అనే యువకుడు తన మామకోడలు అనే యువతితో వివాహం చేసుకున్న క్షణాల్లోనే ఛాతినొప్పితో ఒక్కసారిగా కుప్పకూలాడు.

- Advertisement -

వెంటనే అతనిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినా, అక్కడికి చేరేసరికి ప్రవీణ్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. వరుడు నివాసం జామ్‌ఖండి తాలూకాలోని కుంబరహల్లా గ్రామం కాగా, వధువు బెల్గాం జిల్లాకు చెందిన పార్థనహళ్లి గ్రామానికి చెందినది. ఈ విషాద ఘటనతో పెళ్లి వేడుక కన్నీటి పర్యంతం అయ్యింది. వధువు కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ఇంతకుముందు ఫిబ్రవరిలో మధ్యప్రదేశ్‌లో ఓ వివాహ వేడుకలో యువతి డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతిచెందగా, గత డిసెంబర్‌లో యూపీ లోని అలీఘర్‌లో పాఠశాల స్పోర్ట్స్ ఈవెంట్‌లో పాల్గొన్న 14 ఏళ్ల బాలుడు గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటనలు యువతలో గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News