GST Savings Festival Begins Tomorrow: దేశ ప్రజలకు ప్రధాని మోదీ గుడ్‌న్యూస్ చెప్పారు. జీఎస్టీ 2.0 సంస్కరణల్లో భాగంగా కొన్ని వస్తువులపై భారీగా పన్ను రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కొత్త పన్ను స్తాబ్‌లు నేటి అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్నట్లు స్పష్టం చేశారు. ఈ కొత్త స్లాబుల ద్వారా దేశంలో సంతోషాలు వెల్లివిరియనున్నాయని, రేపటి నుంచి దేశమంతా సంతోషపడే జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి రాబోతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. పన్ను రేట్లు తగ్గడం ద్వారా రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్ జరగబోతున్నదని చెప్పారు. జీఎస్టీ 2.0 సంస్కరణలతో భారత వృద్ధి రేటు మరింత పెరగబోతున్నదని, రాష్ట్రాలన్ని అభివృద్ధిలో దూసుకుపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జీఎస్టీ సంస్కరణల నేపథ్యంలో నేడు (సెప్టెంబర్ 21)న జాతినుద్దేశించి మాట్లాడిన నరేంద్ర మోదీ.. దేశ ప్రజలకు శరన్నవరాత్రుల శుభాకాంక్షలు తెలిపారు. ఈ జీఎస్టీ సంస్కరణలతో పేద, మధ్యతరగతి ప్రజలకు ఏంతో మేలు జరుగుతోందని చెప్పారు. కొత్త జీఎస్టీతో ప్రజల డబ్బు ఆదా అవుతుందని అన్ని వర్గాల వారికి మేలు జరుగుతుందన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. “2017లో తీసుకొచ్చిన జీఎస్టీ ద్వారా కొత్త అధ్యాయం మొదలైంది. జీఎస్టీకి ముందు పన్నుల విధానం గందరగోళంగా ఉండేది. రకరకాల పేర్లతో ఎన్నో పన్నులు ఉండేవి. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి సరుకు రవాణా చేయాలన్నా పన్నులు కట్టాల్సి వచ్చేది. గతంలో బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తువులు తీసుకొచ్చి అమ్ముకోవాలంటే ఎంతో కష్టంగా ఉండేది. టోల్, ట్యాక్స్‌లతో కంపెనీలు ఇబ్బంది పడేవి. ఆ ప్రభావం వినియోగదారులపై పడటం ద్వారా అధిక ధరలకు వస్తువులు కొనుగోలు చేయాల్సి వచ్చేది. అందుకే, మేం అన్ని రకాల పన్నులను రద్దు చేసి 2017లో జీఎస్టీ తీసుకొచ్చాం. 2024లో గెలిచిన తర్వాత జీఎస్టీలపై ప్రాధాన్యం ఇచ్చాం. రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇచ్చాం. జీఎస్టీ సంస్కరణలతో అన్నీ వర్గాలతో మాట్లాడాం. వన్ నేషన్-వన్ ట్యాక్స్ అనే మధ్య తరగతి ప్రజల చిరకాల కలను సాకారం చేశాం. జీఎస్టీ సంస్కరణలతో దేశం మరింత బలపడుతుంది. రేపటి నుంచి దేశంలో సంతోషాలు వెల్లివిరయనున్నాయి. జీఎస్టీ సంస్కరణలతో పెట్టుబడులు ప్రవాహం పెరుగుతుంది.” అని పేర్కొన్నారు.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/indrakeeladri-devi-navaratri-2025/
భారత వృద్ధి రేటుకు ఊతం..
జీఎస్టీ మార్పులతో పేదలు, మధ్య తరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని మోదీ తెలిపారు. నిత్యవసర సరుకులపై ధరలు భారీగా తగ్గుతాయని, జీఎస్టీ మార్పులతో వ్యాపారులు, తయారీదారులకు కూడా మేలు జరుగుతుందన్నారు. దేశమంతా సంతోషడే జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు, జీఎస్టీ 2.0 సంస్కరణలు భారత వృద్ధి రేటుకు, ఆత్మనిర్భర్ భారత్‌కు మరింత ఊతమిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జీఎస్టీతో వన్ నేషన్ వన్ ట్యాక్స్ కల సాకారమైందన్నారు. ఇటీవల దేశంలోని అన్ని వర్గాలతో చర్చించి జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చామని.. రాష్ట్రాలతో చర్చించాకే ఇంత పెద్ద సంస్కరణలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. జీఎస్టీ సంస్కరణలతో పన్నులు మరింత సులభంగా మారతాయని పేర్కొన్నారు.


