గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. దీంతో తమ ప్రకటనలకు మరింత పదును జోడించి హై ఓల్టేజ్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి పార్టీలన్నీ. చివరి నిమిషం ప్రచార సభలు కావటంతో ఇవి హోరాహోరీగా సాగుతున్నాయి. బీజేపీపై ప్రశ్నల వర్షాన్ని కురిపించటంపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు పూర్తి పోకస్ పెడుతున్నాయి. “27 ఏళ్లు మీ ఏలుబడిలో ఉన్న రాష్ట్రంలో ఎన్నికలు గెలిచేందుకు సాక్షాత్తూ ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ఇక్కడ తిష్టవేయక తప్పడం లేద”ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేర్కొనడం గుజరాతీయులను విశేషంగా ఆకట్టుకుంటోంది. గుజరాత్ లో దాదాపు 3 దశాబ్దాలు పాలించిన బీజేపీ తమ ఓటమిని ఊహిస్తున్నట్టుందని అందుకే వార్డు వార్డుల్లో బీజేపీ జాతీయ నేతలంతా కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరిగేలా చేస్తోందన్నారు ఖర్గే. పీఎం, హెఎం, సీఎంలు అందరూ గుజరాత్ కు క్యూ కట్టి మరీ ప్రచారం చేస్తున్నారని ఖర్గే అన్నారు. రాష్ట్రంలో మార్పు తేలేని కమలనాథులు పదేపదే సీఎంలను మాత్రం మార్చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. ట్రైబల్ ఓటర్లు అత్యధికంగా ఉన్న నర్మదా జిల్లాలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న ఖర్గే ప్రధానిని “ఝూటోం కా సర్దార్ ” (అసత్యాల సర్దార్)అంటూ ఖర్గే అధికార బీజేపీపై నిప్పులు చెరిగారు.
Gujarat Elections 2022: మీ ఏలుబడిలో 27 ఏళ్లు..అయినా ప్రధాని, హోం మంత్రి రాక తప్పదా? ఛేంజ్ అంటే సీఎంలను ఛేంజ్ చేయటమే!
సంబంధిత వార్తలు | RELATED ARTICLES