Friday, November 22, 2024
Homeనేషనల్Gun Culture: గన్ కల్చర్ పై విరుచుకుపడ్డ సీఎం

Gun Culture: గన్ కల్చర్ పై విరుచుకుపడ్డ సీఎం

భగవంత్ మాన్, పంజాబ్ సీఎం గన్ కల్చర్ పై విరుచుకుపడ్డారు. ఏకంగా 800 గన్ లైసెన్సులను ఆయన క్యాన్సిల్ చేశారు. ఇప్పటవరకూ మొత్తం 2,000 ఆయుధాల లైసెన్సులను భగవంత్ మాన్ సర్కారు రద్దు చేసింది. పంజాబ్ లో గన్ కల్చర్ చాలా ఎక్కువ, పైగా డ్రగ్స్ కూడా.. దీంతో ఇక్కడ నానాటికీ హింస పెట్రేగిపోతోంది.

- Advertisement -

దీంతోపాటు ఆయుధాలను బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించటాన్ని కూడా పంజాబ్ సర్కారు నిషేధించింది. గుళ్లు, పండుగలు, పెళ్లిళ్లలో ఇకమీదట గతంలోలా రెచ్చిపోయి గాల్లోకి కాల్పులు జరపటాలు వంటివి కఠినంగా నిషేధించారు. ఆయుధాలను వెంట తీసుకెళ్లటం, ప్రదర్శించటం వంటివి పంజాబీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. పంజాబ్ రాష్ట్రంలో అధికారికంగానే 3,73,053 ఆయుధాల లైసెన్సున్నాయి. 28 ఏళ్ల పంజాబీ సింగర్ సిద్ధు మూస్ వాలా ను అతికిరాతకంగా చంపేసిన నేపథ్యంలో పంజాబ్ సర్కారు ఆయుధాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News