పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో కాల్పులు కలకలం రేపాయి. సిక్కులు పవిత్రంగా భావించే స్వర్ణ దేవాలయం(Golden Temple)లో పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ పార్టీ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్(Sukhbir Singh Badal)పై గుర్తుతెలియని వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. అయితే బుల్లెట్ గాల్లోకి వెళ్లడంతో ప్రమాదం తప్పింది.
- Advertisement -
కాగా శిక్షలో భాగంగా స్వర్ణ దేవాలయం ఎంట్రీ గేట్ వద్ద సుఖ్‌బీర్ చక్రాల కుర్చీపై కూర్చొని సేవాదార్(కాపలాదారుడు)గా విధుల నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ వృద్ధుడు ఆయనకు కొన్ని అడుగుల దూరంలోనే తుపాకీ తీసి సుఖ్‌బీర్‌పై కాల్పులు జరిపాడు. గమనించిన ఆయన వ్యక్తిగత సిబ్బంది వెంటనే వృద్ధుడిని అడ్డుకుని పక్కకు తీసుకెళ్లడంతో ప్రమాదం తప్పింది.