Mother Found Dead Clinging to Twin Sons: ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో భారీ వర్షాలు, మేఘ విస్ఫోటం కారణంగా సంభవించిన కొండచరియలు విరిగిపడటం పెను విషాదాన్ని మిగిల్చింది. సహాయక చర్యల్లో భాగంగా శిథిలాల కింద కనిపించిన ఒక హృదయ విదారక దృశ్యం అందరినీ కంటతడి పెట్టించింది.
నందనగర్ ప్రాంతంలో గురువారం కొండచరియలు విరిగిపడిన 16 గంటల తర్వాత.. కున్వర్ సింగ్ అనే వ్యక్తిని సజీవంగా బయటకు తీశారు. అయితే, ఆయన భార్య, కవల కుమారులు మాత్రం మృత్యువాత పడ్డారు.
ALSO READ: Fidelity Test: ఆడబిడ్డ చేత మహిళకు శీల పరీక్ష.. మరుగుతున్న నూనెలో చేయి ముంచి..
తల్లి ఒడిలోనే చనిపోయారు:
రెండు రోజుల తర్వాత, శిథిలాల తొలగింపు సందర్భంగా 38 ఏళ్ల ఆ మహిళ మృతదేహం లభ్యం కాగా, ఆమెను గట్టిగా కౌగిలించుకుని ఉన్న విశాల్, వికాస్ (10 ఏళ్ల కవల కుమారులు) మృతదేహాలు కనిపించాయి. విపత్తు సంభవించినప్పుడు తన పిల్లలను కాపాడుకోవడానికి తల్లి చివరి ప్రయత్నం చేసి, వారిని తన ఆలింగనంలో బంధించి ఉండవచ్చు అని ఈ దృశ్యాన్ని చూసిన సహాయక బృందాలు కన్నీరు పెట్టుకున్నాయి. మరణంలోనూ తల్లి, కొడుకులు విడదీయరాని బంధాన్ని చాటారు.
ALSO READ: Student Suicide: IIT ఖరగ్‌పూర్‌లో కలకలం.. పీహెచ్‌డీ విద్యార్థి అనుమానస్పద మృతి.. ఏడాదిలో ఐదో ఘటన
ఈ విపత్తులో మొత్తం ఎనిమిది మంది గల్లంతవగా, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. వరదలు, కొండచరియల వల్ల మౌలిక సదుపాయాలు భారీగా దెబ్బతినగా, నిరాశ్రయులైన కుటుంబాల కోసం సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారు.
సీఎం పర్యటన:
ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విపత్తు ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, సహాయక చర్యలను పర్యవేక్షించారు. “మేఘ విస్ఫోటం కారణంగా దాదాపు 35 ఇళ్లు దెబ్బతిన్నాయి. 200 మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. 14 మంది గల్లంతయ్యారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించాం, తీవ్రంగా గాయపడిన వారిని ఎయిమ్స్ రిషికేశ్‌కు తరలిస్తాం. సెప్టెంబర్ చివరి వరకు రుతుపవనాలు ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించాం” అని ఆయన తెలిపారు.
ALSO READ: Gang Rape: బంధువుల ఇంటికి వచ్చిన బాలికపై సామూహిక అత్యాచారం.. నలుగురు అరెస్ట్


