UttarPradesh: ఉత్తర్ ప్రదేశ్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో అనేక నగరాలు అతలాకుతలం అవుతున్నాయి. ప్రయాగ్‌రాజ్, వారణాసి నగరాలు తీవ్ర జలదిగ్బంధంలో ఉన్నాయి. వారణాసి, ప్రయాగ్‌రాజ్ లోని నివాస గృహాలలో వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాజాపూర్, చోటా బఘాడా ప్రాంతాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. చోటా బఘాడా ప్రాంతానికి చెందిన దంపతులు పీకల్లోతు వరద నీటిలో నవజాత శిశువును ఆస్పత్రికి తీసుకువెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనతో యోగి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Readmore: https://teluguprabha.net/national-news/pahalgam-attacker-funeral-in-pok-exposes-pakistan/
వారణాసిలో గంగా నది ఉగ్రరూపం దాల్చింది. ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. నీటి మట్టం ప్రమాద స్థాయిని దాటడంతో జిల్లా యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. పలు ప్రాంతాలు జలమయం కావడంతో వీధుల్లో పడవలు నడుపుతున్న వీడియో సామజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తుంది.
పై ఘటనలతో ఆప్ నేత సంజయ్ సింగ్ యూపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. యోగి ప్రభుత్వం ప్రజలను పట్టించుకోకుండా, ఆడంబరాల కోసం వేల కోట్లు ఖర్చు పెడుతుందని అన్నారు. వరదలో చిక్కుకున్న వారికి ఎటువంటి సహాయక చర్యలు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది నూతన భారత దేశం, ధార్మిక నగరం ప్రయాగరాజ్ లో నవజాత శిశువుని తల్లిదండ్రులు ఇలా వరదల్లో తీసుకెళ్తారు అని X(ట్విట్టర్) లో పోస్ట్ చేసారు.
Readmore: https://teluguprabha.net/national-news/india-bloc-dinner-diplomacy-rahul-gandhi-meeting/
సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కూడా యోగి ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రయాగ్ రాజ్ లో రూ.20 వేల కోట్లు ఖర్చు చేసిన అభివృద్ధి ఇదేనా అని ఆయన ప్రశ్నించారు.


