Saturday, November 15, 2025
Homeనేషనల్Heavy Rains: రాజస్థాన్‌లో భారీ వర్షాలు.. 12 మంది మృతి

Heavy Rains: రాజస్థాన్‌లో భారీ వర్షాలు.. 12 మంది మృతి

Heavy Rains In Rajasthan: ఉత్తరాధి రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. రాజస్థాన్‌లో ఏర్పడిన వాయుగుండంతో పాటు ఝార్ఖండ్, బిహార్ రాష్ట్రాల్లో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావంతో ఉత్తరాధి రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్‌లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పలు జిల్లాలు అతలాకుతం అవుతున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నారు. వర్షాల ధాటికి జరిగిన పలు ఘటనల్లో ఇప్పటివరకు 12 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

లోతట్టు ప్రాంతాల్లో అయితే రైల్వే ట్రాకులపై వరద నీరు రావడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో పలు రైళ్లను దారి మళ్లించడంతో పాటు టైమింగ్స్ మార్చారు. ఇక కోటా జిల్లాలోని చంబల్ నది ఉగ్రరూపం దాల్చడంతో సమీప గ్రామాలు నీట మునిగాయి. అదే సమయంలో నదిలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు జాలర్లు కొట్టుకుపోయారు. వారి జాడ కోసం వెతికినా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు జోధ్‌పూర్ జిల్లాలో కరెంట్ షాక్‌తో ఓ రైతుతో పాటు లైన్‌మ్యాన్ ప్రాణాలు కోల్పోయారు.

కొన్ని జిల్లాల్లో అయితే వరద ప్రవహానికి రోడ్లు తెగిపోయాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. రాన్‌పూర్‌లో స్కూటీపై వెళ్తున్న ఓ విద్యార్థిని వరదలో కొట్టుకుపోయింది. సహాయక బృందాలు కాపాడినప్పటికీ అప్పటికే మృతి చెందింది. భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను బోట్లు సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Also Read: సుప్రీంకోర్టు సీరియస్.. సోషల్ మీడియాలో హద్దు మీరితే కఠిన చర్యలు!

ఇదిలా ఉంటే అల్పపీడనం కారాణంగా తెలుగు రాష్ట్రాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలోని కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, మేడ్చల్, నారాయణపేట, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గంటకు 30-40 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయన్నారు. అటు ఏపీలోని పలు జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. వర్షాలు పడే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, పొలం పనికి వెళ్లేవారు, గొర్రెల కాపరులు చెట్లు, గుడిసెలు కింద తలదాచుకోవద్దని సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad