తమిళనాడులో ఉన్నట్టుండి అకాల వర్షాల బెడద వచ్చిపడింది. దీంతో నాగపట్టణం జిల్లాలో అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. శ్రీలంకలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు కరైకాల్ ప్రాంతంలో బంగాళాఖాతం మీదుగా అల్పపీడనం ప్రాంతంగా తుపాను ధాటికి భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. అల్పపీడన ప్రభావంతో పాండిచ్చేరిలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు దక్షిణ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ వెల్లడించింది. బంగాళాఖాతం అల్లకల్లోలంగా ఉంది.
Heavy rains: భారీ వర్షాలు, స్కూళ్లకు సెలవు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES