Saturday, November 15, 2025
Homeనేషనల్KumbMela traffic: కుంభమేళాలో భక్తుల రద్దీతో 47 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

KumbMela traffic: కుంభమేళాలో భక్తుల రద్దీతో 47 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

(KumbMela) కుంభమేళాలో భక్తుల రద్దీతో 47 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ (traffic) జరిగింది. లైఫ్ టైంలో ఒకసారే వచ్చే ఈ మహ కుంభమేళాకు తండోపతండాలుగా భక్తులు పోటెత్తుతున్నారు. హిందూవులకు144 ఏళ్లకు వచ్చే అతి పెద్ద పండుగ కావటంతో ప్రయాగ్ రాజ్ త్రివేణీ సంగమం వద్ద పవిత్రస్నానాలు చేసేందుకు కోట్ల మంది భక్తులు ఇసుక వేస్తే రాలనంతగా వస్తున్నే ఉన్నారు.

- Advertisement -

పైగా ఈ రోజు మౌని అమావాస్య కావటంతో అధికారులు అంచనా వేసిన దాని కంటే ఊహించని రీతిలో భక్తులు వస్తున్నారు. 12 నుంచి 15 కోట్ల మేరకు భక్తులు వచ్చే అవకాశం ఉందంటున్నారు. దీంతో ప్రయోగ్ రాజ్ వద్ద 47 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది.

అధికారులు ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు చాలా కష్టపడుతున్నారు. భక్తులు సహకరించాల్సిందిగా కోరుతున్నారు. ఓ వైపు భక్తుల తాకిడితో తొక్కిసలాట జరిగి సూమారు 15 మంది వరకు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇప్పటికే ఈ ఘటనపై దేశ ప్రధాని నరేంద్ర మోడీ యోగి ఆదిత్యకు ఫో‌న్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటేనే సహయక చర్యలు చేపట్టాలని సీఎం యోగి ఆదిత్యను ఆదేశించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad