జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండి కూటమి ఘన విజయం సాధించింది. అత్యధిక స్థానాలు గెలుచుకున్న జేఎంఎం పార్టీ అధ్యక్షుడు సీఎం హేమంత్ సోరెన్ (Hemant Soren) సారథ్యంలో మరోసారి జార్ఖండ్ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. వరుసగా రెండోసారి హేమంత్ సోరెన్ సీఎం పీఠాన్ని అధిష్టించనున్నారు.
ఈ క్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ సంతోష్ గాంగ్వార్ తో హేమంత్ (Hemant Soren) భేటీ అయ్యారు. ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన ఆయన… నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు గవర్నర్ కి వివరించారు. ఇందుకు సంబంధించిన భాగస్వామ్య పక్షాల మద్దతు లేఖను గవర్నర్ కి అందజేశారు. జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా నవంబర్ 28న హేమంత్ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు జేఎన్ఎం వర్గాలు వెల్లడించాయి. ఆయనతోపాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా అదేరోజు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.