Monday, December 9, 2024
Homeనేషనల్Hemant Soren: జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం

Hemant Soren: జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం

Hemant Soren| జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా(JMM) చీఫ్ హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలోని మోరబడి గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ సంతోశ్‌ కుమార్ గంగ్వార్(Santosh Gangwar) హేమంత్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇండియా కూటమి నేతలు తదితరులు హాజరయ్యారు. జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడం హేమంత్ సోరెన్‌కు ఇది నాలుగోసారి.

- Advertisement -

కాగా ఇటీవల జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 81 స్థానాలు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం 34 సీట్లు, కాంగ్రెస్ 16 సీట్లు, ఆర్జేడీ 4 సీట్లు, సీపీఐ(ఎంఎల్‌) రెండు స్థానాల్లో విజయం సాధించాయి. ఇక బీజేపీ(BJP) నేతృత్వంలోని ఎన్డీఏ(NDA) కూటమి కేవలం 24 సీట్లకే పరిమితమైంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News