Hero Sonu Sood visits flood areas: సోనూసూద్ మళ్లీ వార్తల్లో నిలిచాడు. సినిమాల కంటే సామాజిక సేవా కార్యక్రమాలతోనే అభిమానుల్లో గుర్తింపు సంపాదించుకున్నాడు. రీల్‌లైఫ్‌లో విలన్‌గా కనిపించే సోనూసూద్ నిజ జీవితంలో రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. కరోనా సమయంలో ఈ నటుడు చెసిన సేవా కార్యక్రమాలు, దాన ధర్మాలను అంత ఈజీగా మర్చిపోలేనివి. మరి ఇప్పుడు ఎలాంటి సేవతో వార్తల్లో నిల్చాడో తెలుసుకుందాం!
కలియుగ కర్ణుడి సాయం: దేశవ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షలతో ఎన్నో ప్రాంతాలు నీటమునిగాయి. చాలా చోట్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. నదులు, వాగులు పొంగిపొర్లడంతో ఊర్లకుఊర్లు నీట మునిగిపోయాయి. మరికొన్ని ఇళ్లు అయితే వరదల్లో కొట్టుకుపోయాయి. ప్రజలకు ఎంతో ఆస్తినష్టం నెలకొంది. వరదల్లో చిక్కుకున్నవారిని, ఇళ్లు కోల్పోయిన వారిని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుంటున్నాయి. పలువురు సెలబ్రెటీలు సైతం వరద బాధితులకు సాయం చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది వరదబాధితులను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా వరద బాధితులను ఆదుకునేందుకు.. కలియుగ కర్ణుడిగా పేరొందిన సోనూసూద్ ముందుకు వచ్చాడు.
Also Read: https://teluguprabha.net/national-news/darjeeling-cracks-down-on-monkey-feeding-with-heavy-fines/
వరద ప్రాంతాల్లో పర్యటించిన సోనూసూద్: రియల్ హీరో ఇప్పటికే ఎంతో మందికి సాయం చేశాడు. కష్టాల్లో ఉన్న వారికి తన స్థాయికి తగ్గట్లుగా సహాయం చేశాడు. తాజాగా కలియుగ కర్ణుడు పంజాబ్‌లో వచ్చిన వరద ప్రాంతాల్లో పర్యటించాడు. ఇటీవల కురిసిన వర్షల కారణంగా పంజాబ్‌లోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. అలాగే అమృత్ సర్ లోని వరద ప్రాంతాల్లో పర్యటించిన సోనూసూద్.. అక్కడి బాధితులతో మాట్లాడారు. వారిని పరామర్శించి సాయం చేస్తానని హామీ ఇచ్చాడు.
ఇలాంటోళ్లు ఊరికొకరుంటే చాలంటున్న నెటిజన్స్: పంజాబ్‌లో వరదల కారణంగా చాలా ఇళ్లు కొట్టుకుపోయాయి. అన్నీ కోల్పోయి ఎంతో మంది నిరాశ్రయులు అయ్యారు. దీంతో ఇళ్లు కోల్పోయిన వారికి తిరిగి ఇళ్లు నిర్మిస్తానని సోనూసూద్ హామీ ఇచ్చారు. సోనూసూద్ హామీ ఇవ్వడంపై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. సోనూసూద్ మంచి మనసును సోషల్ మీడియాలో పలువురు కొనియాడుతున్నారు. సోనూసూద్ తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. సోనూసూద్ లాంటి వారు ఊరుకి ఒకరు ఉంటే ఇక ఏ కష్టమచ్చినా ధైర్యంగా ఉండొచ్చని సామాన్య ప్రజలు అంటున్నారు.


