Mathura: హిందూ పండుగలలో శ్రీ కృష్ణ జయంతికి ప్రముఖ స్థానం ఉంది. దేశంలోని అన్ని ప్రాంతాలలో శ్రీ కృష్ణ జయంతి వేడుకలు అంబరాన్ని తాకేలా నిర్వహిస్తారు. ఉత్తర్ ప్రదేశ్ లోని మధురలో అన్ని ప్రధాన దేవాలయాలలో ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా శ్రీ కృష్ణ జన్మభూమి ఆలయం, బృందావనంలోని ఠాకూర్ బాంకే బిహారీ ఆలయంలో ఈ వేడుకలను వైభవంగా జరుపుతారు.
ఆగష్టు 16న శ్రీకృష్ణ జయంతి ఉత్సవాలు, ఆగస్టు 17న నందగావ్ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. గత సంవత్సరం జన్మాష్టమి సందర్భంగా సుమారు 4.2 మిలియన్ల భక్తులు మథురరను సందర్శించారు. ఈసారి 5 మిలియన్లు కంటే ఎక్కువ మంది భక్తులు ఉత్సవాలలో పాల్గొనే అవకాశం ఉందని జిల్లా మేజిస్ట్రేట్ చంద్రప్రకాష్ సింగ్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్లోక్ కుమార్ తెలిపారు.
Read more: https://teluguprabha.net/national-news/brother-sister-reunite-raksha-bandhan-60-years/
ఈ ఉత్సవాలకు సంబంధించి అధికారులు తగిన చర్యలు చేపడుతున్నారు. మథుర, బృందావన, బర్సానా, గోకుల్, నందగావ్, గోవర్ధన, మహావన్ సహా అన్ని తీర్థయాత్ర కేంద్రాలలో తగిన ఏర్పాట్లు, భద్రతా చర్యలు చేపడుతున్నారు. శ్రీకృష్ణ జన్మభూమి ఆలయ సముదాయంలో 150 సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయగా, పరిసర ప్రాంతాల్లో 100కు పైగా సీసీటీవీలు అమర్చబడ్డాయి. తొలిసారిగా నిఘా కోసం ఏఐ ఆధారిత డ్రోన్ కెమెరాలను ఉపయోగించనున్నట్లు తెలిపారు.
‘శ్రీ కృష్ణోత్సవ్’ పేరిట ఆగస్టు 15 నుండి 17 వరకు మూడు రోజుల పాటు ఉత్తరప్రదేశ్ బ్రజ్ తీర్థ వికాస్ పరిషత్ ఉత్సవాలు నిర్వహించనుంది. మధుర-బృందావన్ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్-చైర్మన్, వికాస్ పరిషత్ ఎక్స్-అఫీషియో సీఈఓ శ్యామ్ బహదూర్ సింగ్ మాట్లాడుతూ.. ఆగస్టు 15 ఉదయం శ్రీ కృష్ణ జన్మస్థాన్ ప్రధాన ద్వారం నుంచి పోత్రా కుండ్, గోవింద్ నగర్, డీగ్ గేట్ వరకు ఒక బహుళ ఊరేగింపు నిర్వహించి, అనంతరం మళ్లీ జన్మ స్థానానికి చేరుకుంటుందని తెలిపారు.
Read more: https://teluguprabha.net/national-news/operation-sindoor-indian-army-retaliation-dwivedi/
ఈ ఊరేగింపులో 250 మంది జానపద కళాకారులు పాల్గొని వివిధ రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ నృత్యాలతో సందడి చేస్తారు. భక్తితో కూడా ఇతిహాస వృత్తాల మేళవింపుతో జన్మాష్టమి ఉత్సవాలు నిర్వహించబడతాయి. శ్రీకృష్ణ జయంతి సందర్భంగా దేశం నలుమూలల నుండి భారీ స్థాయిలో భక్తులు మథుర, బృందావనానికి చేరుకుంటారు. ఠాకూర్ బంకే బిహారీ ఆలయ యాజమాన్యం భక్తులకు సూచన చేసింది. వృద్దులు, చిన్నారులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, గర్భిణీ స్త్రీలు ఈ వేడుకలకు రాకూడదని ముందుగానే భక్తులను కోరింది. జనసందోహం కారణంగా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని తెలిపింది.


