Wednesday, September 18, 2024
Homeనేషనల్himachal: హిమాచల్ ప్రదేశ్‌లో వ‌ర్ష బీభ‌త్సం.. 72 రోడ్లు మూసివేత‌

himachal: హిమాచల్ ప్రదేశ్‌లో వ‌ర్ష బీభ‌త్సం.. 72 రోడ్లు మూసివేత‌

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల కార‌ణంగా 72 రోడ్లపై వాహ‌న రాక‌పోక‌లు నిలిచిపోయాయి. స్థానిక వాతావరణ కార్యాలయం సెప్టెంబర్ రెండు వ‌ర‌కూ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ తెలిపిన వివ‌రాల‌ ప్రకారం మూసివేసిన‌ 72 రోడ్లలో, సిమ్లాలో 35, మండిలో 15, కులులో తొమ్మిది, ఉనా, సిర్మౌర్, లాహౌల్, స్పితి జిల్లాల్లో ఒక్కొక్కటి ఉన్నాయి. రాష్ట్రంలో వర్షం కారణంగా 10 విద్యుత్, 32 నీటి సరఫరా పథకాలకు కూడా అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. జూన్ 27న రుతుపవనాలు వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో వర్షాల కారణంగా 150 మంది మృతిచెందారు.

- Advertisement -

వర్షం కారణంగా రాష్ట్రానికి రూ.1265 కోట్ల నష్టం వాటిల్లింది. శుక్రవారం సాయంత్రం నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. సుందర్‌నగర్‌లో 44.8 మిల్లీమీటర్లు (మిమీ), శిలారులో 43.1 మిమీ, జుబ్బరహట్టిలో 20.4 మిమీ, మనాలిలో 17 మిమీ, సిమ్లాలో 15.1 మిమీ, స్లాపర్‌లో 11.3 మిమీ, డల్హౌసీలో 11 మిమీ వర్షపాతం నమోదైంది. సెప్టెంబరు రెండు వ‌ర‌కూ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని స్థానిక వాతావరణ కార్యాలయం ‘ఎల్లో’ అలర్ట్‌ను జారీ చేసింది.

మరోవైపు గుజరాత్ భారీ వర్షాలతో అల్ల‌క‌ల్లోలంగా మారింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అదే సమయంలో కర్ణాటకలోని అరేబియా సముద్రానికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. వాతావరణ శాఖ తెలిపిన వివ‌రాల ప్రకారం దేశంలోని ఈశాన్య రాష్ట్రాలు, మధ్య భారతదేశంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒడిశాతో సహా ఐదు తూర్పు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. దక్షిణ భారత రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌తో సహా ఇతర ఉత్తర భారత రాష్ట్రాల్లో వాతావరణం సాధారణంగానే ఉంటుందని అంచనా. గుజరాత్ తీరంలో అరేబియా సముద్రంలో ఏర్పడిన ఆస్నా తుపాను ఒమన్ వైపు మళ్లింది. దీంతో గుజరాత్ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News