Saturday, November 15, 2025
Homeనేషనల్Himachal Pradesh: డైలాగ్ చెబుతూ.. స్టేజ్‌ మీదే కుప్పకూలిన నటుడు!

Himachal Pradesh: డైలాగ్ చెబుతూ.. స్టేజ్‌ మీదే కుప్పకూలిన నటుడు!

Actor Death-Himachal Pradesh:హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన రామలీల ప్రదర్శనలో ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది. చంబా పట్టణంలోని చౌగన్ మైదానంలో మంగళవారం రాత్రి రామలీల రెండవ రోజు కార్యక్రమం జరుగుతుండగా సీనియర్ నటుడు అమ్రేష్ మహాజన్ హఠాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. వేదికపై తన పాత్రలో మునిగిపోయి డైలాగ్ చెబుతుండగానే ఆయనకు గుండెపోటు వచ్చి మృతి సంభవించింది.

- Advertisement -

సీతాస్వయంవర సన్నివేశం..

ఈ సంఘటన రాత్రి సుమారు 1.30 గంటల సమయంలో జరిగింది. ఆ సమయానికి వేదికపై సీతాస్వయంవర సన్నివేశం ప్రదర్శిస్తున్నారు. నటులు తమ తమ డైలాగులు చెప్పుకుంటూ ముందుకు వెళ్తుండగా, రాజు దశరథుడి పాత్రలో ఉన్న 73 ఏళ్ల అమ్రేష్ మహాజన్ ఆకస్మికంగా తన సహనటుడి భుజంపై వాలి కుప్పకూలిపోయారు. మొదట ఇది కూడా నాటకంలోని భాగమే అనుకున్నారు ప్రేక్షకులు, సహనటులు. కానీ కాసేపటికి ఆయన స్పృహ కోల్పోయినట్లు తెలిసింది. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. కానీ అక్కడి వైద్యులు ఆయనను పరిశీలించి అప్పటికే మరణించినట్లు ప్రకటించారు.

Also Read: https://teluguprabha.net/devotional-news/hidden-meaning-of-spider-under-durga-forehead-dot/

దశరథుడు, రావణుడు..

అమ్రేష్ మహాజన్ చంబాకు సమీపంలోని మొఘల్ మొహల్లాకు చెందినవారు. గత నలభై ఏళ్లుగా చంబా చారిత్రాత్మక చౌగన్ మైదానంలో జరిగే శ్రీరామలీలలో సక్రియంగా పాల్గొంటున్నారు. ఆయన అనేక సార్లు దశరథుడు, రావణుడు వంటి ప్రధాన పాత్రలు పోషించారు. రామలీల వేదికపై ఆయన ఉనికి స్థానిక ప్రేక్షకులకు ఎంతో పరిచయం. ప్రతి సంవత్సరం ఆయన నటన కోసం చాలామంది ఎదురుచూసేవారు.

రామలీలలో భాగంగా పాత్రధారులు ఎన్నో రాత్రులు నిద్రలేక ప్రాక్టీస్ చేస్తారు. అలాంటి వేదికపై నలభై ఏళ్లుగా నిరంతరంగా నటించడం అమ్రేష్ మహాజన్‌కు గొప్ప అనుభవం. కానీ అదే వేదికపై ప్రాణాలు కోల్పోవడం అందరికీ కలచివేసింది. ఆయన చివరి క్షణాలు కూడా నటనలోనే గడపడం సహనటులను, కుటుంబ సభ్యులను కన్నీటి పర్యంతం చేసింది.

Also Read: https://teluguprabha.net/health-fitness/health-benefits-of-black-eyed-peas-for-body-nutrition/

రామలీల రెండవ రోజు సీతాస్వయంవరం సన్నివేశం ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. ఈ సన్నివేశంలో దశరథుడు పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది. అందువల్ల ఆ సమయంలో వేదికపై వాతావరణం ఉత్కంఠభరితంగా సాగుతుండగా ఈ అనూహ్య సంఘటన జరిగింది. వందలాది మంది ప్రేక్షకులు ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూశారు. మొదట చాలా మంది ఇది కూడా ప్రదర్శనలో భాగమే అనుకున్నారు. కానీ ఆ తర్వాత పరిస్థితి అర్థమయ్యే సరికి ప్రేక్షకులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

వైద్యుల ప్రకారం, అమ్రేష్ మహాజన్‌కు అకస్మికంగా కార్డియాక్ అరెస్టు రావడం వల్ల తక్షణమే మృతి సంభవించింది. ఆయన వయస్సు దృష్ట్యా గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని భావిస్తున్నప్పటికీ, అధికారికంగా మాత్రం కారణం గుండెపోటు అని స్పష్టమైంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad