Sunday, May 18, 2025
Homeనేషనల్హిమాచల్‌ప్రదేశ్‌లో ఈదురుగాలుల బీభత్సం.. ఆరుగురు మృతి..!

హిమాచల్‌ప్రదేశ్‌లో ఈదురుగాలుల బీభత్సం.. ఆరుగురు మృతి..!

హిమాచల్‌ప్రదేశ్‌లో ఆకస్మిక వాతావరణ మార్పులు తీవ్ర పరిణామాలను మిగిల్చాయి. ఆదివారం జరిగిన ఈదురుగాలుల ప్రభావంతో భారీ వృక్షాలు నేలకూలి, కొండచరియలు విరిగిపడి భారీ నష్టం సంభవించింది. మణికరణ్ గురుద్వారా సమీపంలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు గాయపడ్డారు.

- Advertisement -

కులులోని మణికరణ్ గురుద్వారా వద్ద బలమైన గాలులు వీచి పెద్ద చెట్లు నేలకూలాయి. వాటి ప్రభావంతో అక్కడ పార్క్ చేసిన వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. కొండల పై నుంచి రాళ్లు విరిగిపడి కార్లపై పడటంతో ప్రయాణికులు గాయాలపాలయ్యారు. దుకాణాలు ధ్వంసమవ్వడంతో అక్కడి వ్యాపారులకు కూడా భారీ నష్టం వాటిల్లింది. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమై సహాయ కార్యక్రమాలు చేపట్టారు. గాయపడిన వారిని జారిలోని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయక చర్యల్లో రక్షణ దళాలు, వైద్య సిబ్బంది, స్థానిక అధికారులు చురుకుగా పాల్గొన్నారు.

వాతావరణ హెచ్చరికలు, తుఫాన్ ప్రభావం : ఇదిలా ఉండగా, ఈ వారం ప్రారంభంలో తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండవచ్చని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ ఘటన వల్ల ప్రజల జీవితాలు తీవ్రంగా ప్రభావితమవ్వడంతో ప్రభుత్వం పరిస్థితిని సమీక్షిస్తూ, భవిష్యత్తులో ఇలాంటి విపత్తుల నుంచి రక్షణ చర్యలు తీసుకునే దిశగా చర్యలు చేపడుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News