Homeనేషనల్Assam: సీఎంగా హిమంత బిశ్వశర్మ ప్రమాణ స్వీకారం.. హాజరైన మోదీ

Assam: సీఎంగా హిమంత బిశ్వశర్మ ప్రమాణ స్వీకారం.. హాజరైన మోదీ

Himanta Biswa Sarma: అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జగదీష్ ముఖీ ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. ఎన్డీయే కూటమికి స్పష్టమైన మెజారిటీతో హిమంత నాయకత్వంలో ప్రభుత్వం కొలువుదీరింది.

- Advertisement -

హాజరైన ప్రధాని మోదీ: ఈ కార్యక్రమానికి దేశ రాజకీయ దిగ్గజాలు హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ వేడుకకు సాక్ష్యంగా నిలిచారు. ఎన్డీయే కూటమిలో భాగమైన ఏపీ సీఎం చంద్రబాబు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Also read-Big Breaking: నీట్‌ యూజీ- 2026 పరీక్ష రద్దు

వరుసగా రెండోసారి కాంగ్రెసేతర సీఎం: ఈ ప్రమాణ స్వీకారంతో హిమంత బిశ్వ శర్మ ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. అస్సాం చరిత్రలో వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తొలి కాంగ్రెసేతర సీఎంగా ఆయన రికార్డు సృష్టించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే (NDA) కూటమి ఘనవిజయం సాధించింది. అస్సాంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు ఈసీ ఎన్నికలు నిర్వహించగా ఎన్డీయే కూటమి102 స్థానాల్లో గెలిచింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News