Assam CM: అసోం సీఎంగా మరోసారి హిమంత బిశ్వశర్మ ఖరారయ్యారు. ఈ మేరకు ఆదివారం జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశం, ఎన్‌డీయే కూటమి సమావేశంలో హిమంత బిశ్వశర్మను నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈనెల 12న అసోం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీంతో హిమంత బిశ్వశర్మ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టనున్నారు. గత నెలలో జరిగిన ఎన్నికల్లో 126 స్థానాలున్న అసోం అసెంబ్లీలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీయే కూటమి 102 సీట్లు గెలుచుకుని భారీ మెజారిటీని సాధించింది.
Also Read: https://teluguprabha.net/telangana/pm-narendra-modi-speech-on-central-funds-to-telangana/
కాగా, ఈ రోజు గౌహతిలోని లోక్‌భవన్‌లో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన 102 మంది ఎమ్మెల్యేల మద్దతు జాబితాను హిమంత బిశ్వశర్మ అందజేశారు. గువాహటిలో జరిగే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం మే 6న హిమంత తన పదవికి రాజీనామా చేసి, ప్రస్తుతం కేర్‌టేకర్ సీఎంగా కొనసాగుతున్నారు.

