Saturday, November 15, 2025
Homeనేషనల్Corruption: నెలకు రూ.15 వేల జీతం.. కానీ సొంతగా 24 ఇల్లు, రూ. 30కోట్ల ఆస్తులు

Corruption: నెలకు రూ.15 వేల జీతం.. కానీ సొంతగా 24 ఇల్లు, రూ. 30కోట్ల ఆస్తులు

His Salary Was Rs 15,000. But He Owned Rs 30 Crore Assets: పేరుకే అతను గుమస్తా.. కానీ అతడి ఆస్తుల చిట్టా చూస్తే ఎవ్వరైనా నోరు వెల్లబెట్టాల్సిందే. కర్ణాటక రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ లిమిటెడ్ (KRIDL)లో ఒకప్పుడు గుమస్తాగా పనిచేసిన కలకప్ప నిడగుండి అనే వ్యక్తి ఆస్తుల చిట్టా చూస్తే ఎవరికైనా కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం.

- Advertisement -

కర్ణాటకలో లోకాయుక్త అధికారులకు అనుమానం వచ్చి ఇటీవలే కలకప్ప నిడగుండి ఇంటిపై మెరుపుదాడి చేశారు. తీరా చూస్తే, అతని దగ్గర రూ. 30 కోట్లకు పైగా విలువైన ఆస్తులున్నట్లు తేలింది! ఒక సాధారణ గుమస్తాకు, నెలకు కేవలం పదిహేను వేల రూపాయల జీతం వచ్చే వ్యక్తికి ఇన్నేసి ఆస్తులు ఎలా వచ్చాయని అధికారులు ఆశ్చర్యపోయారు.

సోదాల్లో భాగంగా, ఏకంగా 24 ఇళ్లు, 4 ప్లాట్లు, 40 ఎకరాల వ్యవసాయ భూమి, 4 వాహనాలు, 350 గ్రాముల బంగారం, ఒకటిన్నర కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆస్తులన్నీ కలకప్ప నిడగుండి పేరు మీద, అతని భార్య పేరు మీద, అతని బావ పేరు మీద ఉన్నాయి.

ఇదీ సంగతి..

అసలు విషయం ఏంటంటే, కలకప్ప నిడగుండి, అతనితో పాటు పనిచేసిన మాజీ KRIDL ఇంజనీర్ ZM చించోల్కర్ కలిసి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. 96 అసంపూర్తి ప్రాజెక్టులకు సంబంధించిన పత్రాలను తారుమారు చేసి, ఏకంగా 72 కోట్ల రూపాయలకు పైగా ప్రజాధనాన్ని దోచేసినట్లు అధికారులు గుర్తించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad