భారత్‌లో చాపకింద నీరులా హెచ్‌ఎంపీవీ వైరస్(HMPV Virus)వ్యాపిస్తోంది. ఒకేరోజు నాలుగు కేసులు నమోదుకావడం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. కర్ణాటకలో రెండు కేసులు, గుజారాత్, కోల్‌కతాలో ఒక్కో కేసు నమోదైనట్లు ICMR ప్రకటించింది. ఈ వైరస్ లక్షణాలు కూడా దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లాగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాధి లక్షణాలు బయటకు కనిపించడానికి మూడు నుంచి ఆరు రోజులు పడుతుందంటున్నారు.
ఇదిలా ఉండగా రెండు వైరస్ కేసులు నమోదు కావడంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. బహిరంగ ప్రదేశాల్లో తప్పకుండా మాస్క్ ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. వైరల్ లక్షణాలు కనిపిస్తే తప్పకుండా వైద్యులను సంప్రదించి టెస్టులు చేయించాలని సూచించింది. ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేసింది. నిర్లక్ష్యంగా ఉంటే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరికలు జారీ చేసింది.